నా సామిరంగ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ సారి సంక్రాంతి నిరుడు లెక్క ఉండది!
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయిన ఆయన.. భారీ విజయాన్ని అందుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇందులో భాగంగానే కొన్ని ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'నా సామిరంగ' అనే ఫ్యామిలీ మూవీని చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున నటిస్తోన్న తాజా చిత్రమే 'నా సామిరంగ'. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీంతో దీనిపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని అన్ని వర్గాల వాళ్లకు చేరువయ్యేలా తెరకెక్కిస్తున్నారు.

కుటుంబ కథకు మాస్ అంశాలను జోడించి తెరకెక్కిస్తోన్న 'నా సామిరంగ' మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని ఏమాత్రం బ్రేకులు లేకుండా జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం జరుపుతూ ఫైనల్ కాపీని రెడీ చేసేందుకు శ్రమిస్తున్నారు.
అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని రూపొందిస్తోన్న 'నా సామిరంగ' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని యూనిట్ మొదటి నుంచీ చెబుతోంది. అందుకు తగ్గట్లుగానే బిగ్ బాస్ షోలోనూ నాగార్జున పలుమార్లు దీన్ని కన్ఫార్మ్ చేశారు. కానీ, అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై చిత్ర యూనిట్ ప్రకటన వదిలింది.

ముందు నుంచీ అనుకుంటున్నట్లుగానే 'నా సామిరంగ' మూవీని జనవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటనను వదిలింది. ఇందుకోసం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ఉన్నారు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. 'నా సామిరంగ' మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ సంక్రాంతి భారీ చిత్రాలతో నిరుడు లెక్క ఉండదని అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











