చైతూ- శోభితలనే డామినేట్ చేస్తోన్న నాగ్ .. 65 ఏజ్‌లోనూ 6 ప్యాక్ , ఏం తింటాడ్రా బాబు
భారతదేశంలోని ప్రతీ సినీ ఇండస్ట్రీలో కూడా ఒక్కో స్టార్ హీరోకి ఒకో స్పెషాలిటీ ఉంటుంది అని తెలిసిందే. మన టాలీవుడ్ హీరోల విషయానికి వస్తే ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. మన సీనియర్ హీరోస్ లోనే తీసుకుంటే విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్, బాలయ్యకి అయితే మాస్ ఆడియెన్స్ ఇంకా మెగాస్టార్ చిరంజీవి అంటే అటు మాస్ ఇటు క్లాస్..
ఇక ఫైనల్ గా మన టాలీవుడ్ నాలుగో పిల్లర్ అక్కినేని నాగార్జున అంటే లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఈ ఏజ్‌లోనూ తన చార్మింగ్ లుక్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. నాగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మన్మథుడిగా నిలిచిపోయారు. తన యంగ్ ఏజ్ నుంచి కూడా ఒక రొమాన్స్ అండ్ లవ్ సినిమాలు అంటే నాగార్జునే అనే బ్రాండ్ కూడా పడిపోయింది.

ఇలా అక్కినేని నాగార్జున చేసిన ఇన్ని సినిమాలు తర్వాత కూడా తాను అదే లుక్స్ ని మైంటైన్ చేస్తూ నేటి తరానికి కూడా ఒక ఐకాన్ లా నిలిచారు. ఇంకా చెప్పాలంటే తనకి పెళ్లి ఈడులో ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా నాగార్జున అదే లుక్స్ లో ఉండడం అనేది విశేషం. గడిచిన కొద్దినెలల నుంచి నాగార్జున అండ్ అక్కినేని కుటుంబం పైనే మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే.
కాగా నాగ్ వారసుడు టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లి వేడుకల్లో కుటుంబం అంతా తలమునకలై ఉన్నారు. ఇలా ఎట్టకేలకి యువ జంట నాగ చైతన్య, శోభిత ధూళిపాళలు రీసెంట్ గానే పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ కొత్త జంటని తీసుకొని నాగార్జున లేటెస్ట్ గా శ్రీశైలం మల్లన్న ఆలయానికి వెళ్లిన విజువల్స్ ఇపుడు బయటకి వచ్చాయి.
ఈ వీడియో చూసి ఇపుడు అంతా షాకవుతున్నారు. మరి అంతలా ఇందులో ఏముందనే డౌట్ మీకు రావొచ్చు. ఈ వీడియోలో నాగార్జున తన స్టన్నింగ్ ఫిట్నెస్ తో ఒకొక్కరి మతి పోగొట్టేసారు అని చెప్పాలి. కొడుకు కోడల్ని తీసుకెళ్లిన నాగ్ అందం విషయంలో యువ జంటను డామినేట్ చేయడం విశేషం. ఇపుడు నాగార్జునకి 65 ఏళ్ళు. ఈ ఏజ్ లో కూడా నాగార్జున 6 ప్యాక్ బాడీలో కనిపించడం అక్కినేని ఫ్యాన్స్ సహా ఈ వీడియో చూసిన ఎవరిని అయినా ఎగ్జైట్ చేసి తీరుతుంది.
అసలు ఈ ఏజ్ లో కూడా ఇంత ఫిట్నెస్ మైంటైన్ చేయడం అనేది చిన్న విషయం కానీ కాదు. అప్పుడెప్పుడో దశాబ్దం కాలం కితం డమరుకం సినిమాకి నాగార్జున తన 50 ఏళ్ల వయసులోనే 6 ప్యాక్ చేయడం చూసి అంతా షాకయ్యారు . కానీ ఇప్పుడు 65 ఏజ్ వచ్చినా కూడా అంతే ఫిట్నెస్ లో కనిపించడం అనేది మరింత ఆశ్చర్యకరమే అని చెప్పాలి. ప్రస్తుతం నాగార్జున "కుబేర" అలాగే "కూలీ" అనే రెండు సినిమాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











