The Ghost Trailer: భయంతో ఎవరు బ్రతకకూడదు.. ఎమోషనల్ సీన్స్ తోనే నాగార్జున యాక్షన్

అక్కినేని నాగార్జున మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ది గోస్ట్ సినిమా దసరా ఫెస్టివల్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఇదివరకే టీజర్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ తో కూడా అంచనాల స్థాయిని మరింత పెంచింది. ఆ వివరాల్లోకి వెళితే..

వారిని కాపాడేందుకు

వారిని కాపాడేందుకు

ఇంటర్పోల్ పవర్ఫుల్ ఆఫీసర్ గా కనిపించబోతున్న నాగార్జున ఒక సీక్రెట్ ఆపరేషన్ నిమిత్తం తన సోదరిని అలాగే ఆమె కూతురిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సినిమా ట్రైలర్ లో కనిపిస్తోంది. అండర్ గ్రౌండ్ మాఫియా డ్రగ్స్ మాఫియా అలాగే మరికొంతమంది శత్రువులను ఎదుర్కొంటూ ఉంటాడు. నలువైపుల నుంచి శత్రువులు దాడి చేస్తూ ఉండగా వారి నుంచి తన సోదరీ కుటుంబాన్ని ఎలా కాపాడాడు అనేది ఈ సినిమాలో ప్రధాన అంశంగా తెలుస్తోంది.

డబ్బు సక్సెస్..

డబ్బు సక్సెస్..

ఇదివరకే విడుదలైన టీజర్ లో సినిమాకు సంబంధించిన కథ గురించి ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో సినిమాలో మంచి ఎమోషన్ తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలియజేశారు. ఇక ముఖ్యంగా డైలాగ్స్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉన్నట్లు అనిపిస్తోంది. డబ్బు సక్సెస్ అనేది.. సంతోషం కంటే ఎక్కువగా శత్రువులను సృష్టిస్తుంది అని మాట ఇంత ఆలోచింపజేస్తోంది.

ఎమోషనల్ యాక్షన్

ఎమోషనల్ యాక్షన్

అలాగే భయపడుతూ ఎవరు బ్రతకకూడదు అని నాగార్జున ధైర్యంగా చెబుతూ ఉండడం కూడా ట్రైలర్ లో హైలెట్ కనిపించింది. ఈ సినిమాలో మంచి యాక్షన్స్ సీన్స్ తో పాటు ఒక ఎమోషనల్ కంటెంట్ కూడా బలంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు ప్రవీణ్ ఇదివరకే డిఫరెంట్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా అతను అంతకుమించి అనేలా ఎట్రాక్ట్ చేయబోతున్నట్లు అనిపిస్తుంది.

గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

ది ఘోస్ట్ సినిమాను గత రెండు నెలల క్రితం విడుదల చేయాలని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి టీజర్ ట్రైలర్ అయితే అంచనాలను పెంచేసింది. నాగార్జున తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అనిపిస్తోంది. గ్రాండ్ గా ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు.

ప్రముఖ నటీనటులు

ప్రముఖ నటీనటులు

ఈ సినిమాలో నాగార్జున కు జోడిగా సోనల్ చౌహన్ నటించగా.. గుల్ పనగ్, అనికా సురేంద్ర, మనీష్ చౌదరి, రవి వర్మ అలాగే మరి కొంతమంది ప్రముఖ నటి నటీమణులు ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X