కొండా సురేఖ Vs నాగార్జున: ముదిరిన సమంత విడాకుల వివాదం.. ఎన్ని కోట్లకు పరువునష్టం దావా అంటే?
ఇటీవల తెలుగు స్టేట్స్ సినీ ప్రముఖుల్లో సంచలనంగా మారిన లేటెస్ట్ కాంట్రవర్సీ అంశం ఏదన్న ఉంది అంటే అది ఖచ్చితంగా టాలీవుడ్ లో ఎన్నో ఏళ్ళు నుంచి కీర్తి ప్రతిష్టలు గడించిన ప్రముఖ స్టార్ హీరో కుటుంబం అక్కినేని నాగార్జున అలాగే తమ మాజీ కోడలు అలాగే పాన్ ఇండియా హీరోయిన్ అయినటువంటి సమంతపై కూడా తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద సంచలనానికి దారి తీశాయి.
అప్పటికే సినిమాలకి సంబంధించి రాజ్ తరుణ్, నేషనల్ అవార్డు విన్నింగ్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ల కేసుల తర్వాత ఏకంగా ఓ స్టార్ ఫ్యామిలీ టార్గెట్ గా మారడం అనేది నిజంగా ఊహించని అంశంగా మారింది. కాగా మొన్న కొండా సురేఖ సమంత నాగ చైతన్యలు ఎందుకు విడాకులు విడాకులు తీసుకున్నారంటే అందుకు కారణం కేటీఆర్ అని అతని పర్శనల్ పనులు తీర్చమనడంతో సమంతకి, అక్కినేని కుటుంబానికి పడక విడిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా దీనిపై ఒక్క అక్కినేని కుటుంబం మాత్రమే కాకుండా టోటల్ టాలీవుడ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నాగార్జున సహా నాగ చైతన్య అంతా కొండా సురేఖపై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయడం వైరల్ అయ్యింది. కాగా ఇలా కంప్లైంట్ ఇస్తుండడంతోనే కొండా సురేఖ విషయంలో మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.
కాగా ఆమె మళ్ళీ మాట్లాడుతూ మరిన్ని సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా తాను ఇది ఆపను అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఇవన్నీ చూస్తున్న నాగ్ ఊరుకుంటాడా తన మాస్ ని చూపించినట్టుగా సినీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా నాగార్జున తమ కుటుంబ ప్రతిష్టని దిగజార్చినందుకు కొండా సురేఖపై ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో నాగార్జున తన సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదని అంత భారీ అమౌంట్ తమ కుటుంబానికి కట్టాలని అది కూడా అధికార పార్టీ మంత్రిపై వేయనున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ 100 కోట్ల మాట కొండా సురేఖ విషయంలో సంచలనంగా మారుతుంది. కాగా ఈ కేసులో మరి ఎవరు గెలుస్తారో ఎవరు నష్టపోతారో అనేవి వేచి చూడాలి.
ఇక నాగార్జున ఇప్పుడు పలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఒక పక్క హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ నాగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో "కుబేర" అనే ఓ సినిమా అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో "కూలీ" అనే సినిమాలు చేస్తున్నారు. అలాగే మరోపక్క తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 8 లో కూడా తాను హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











