ఓటీటీలో విడుదలకు సిద్దమైన వైల్డ్ డాగ్.. కార్తీ సుల్తాన్ కూడా రెడీ.. ఎప్పుడంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి కరోనా తాకిడికి సినిమాలపై తీవ్ర ప్రభావం పడింది. తెలంగాణలో ఒక్కసారిగా సినిమా థియేటర్ల బంద్ కు పిలుపునివ్వగా చాలా రోజుల తరువాత ఓటీటీలోకి రావాల్సిన సినిమాలు ముందుగానే రావడానికి సిద్ధమయ్యాయి. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ తో పాటు కార్తీ నటించిన సుల్తాన్ సినిమాకు ఓటీటీ ప్రీమియర్స్ కు సిద్ధమయ్యాయి.

అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు
నాగార్జున చాలా గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం వైల్డ్ డాగ్. 2019 మన్మథుడు 2తో డిజాస్టర్ అందుకున్న నాగ్ ఆ తరువాత చాలా కథలపై చర్చలు జరిపి వైల్డ్ డాగ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆశిషోర్ సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేదు.

అర్ధరాత్రి నుంచి నేటి ఫ్లిక్స్ లో
అసలైతే ఈ సినిమాను డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. ఆల్ మోస్ట్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్న తరుణంలో క్రాక్ ఉప్పెన వంటి సినిమాలు హిట్టవ్వడంతో మనసు మార్చుకొని థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమయ్యారు. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇక ఈ గురువారం తోలి సేకను నుంచే సినిమా సందడి చేయనుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ అర్ధరాత్రి స్ట్రీమింగ్ మొదలు కాబోతోంది.

సుల్తాన్ కూడా..
ఇక కార్తీ ఎంతో నమ్మకంతో చేసిన యాక్షన్ డ్రామా సుల్తాన్ కూడా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా వరుస విజయాలు అందుకుంటున్న కార్తీ సుల్తాన్ సినిమాను తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేశాడు. కానీ ఈ సినిమా కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు.
Recommended Video

ఓటీటీ రిలీజ్ డేట్..
పెట్టిన పెట్టుబడికి తమిళ్ లో వచ్చినంత కలెక్షన్స్ తెలుగులో అయితే రాలేదు. ఫైనల్ గా కరోనా ఎక్కువవ్వడంతో సినిమా థియేటర్లు కూడా క్లోజ్ అవుతుండడంతో ఓటీటీ విడుదలను తొందరగానే ఎనౌన్స్ చేసేశారు. మే 2న హాట్ స్టార్ లో తమిళ్ లో సందడి చేయనున్న సుల్తాన్ అదే రోజు తెలుగు వెర్షన్ ఆహా యాప్ లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











