‘వైల్డ్ డాగ్’కు గుడ్ బై.. మిస్ అవుతున్నా అంటూ నాగార్జున ఎమోషనల్
ప్రస్తుతం కింగ్ నాగార్జున వరుసగా షూటింగ్‌లతో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలీలో మూడు వారాలు ఎంజాయ్ చేశాడు. అక్కడి వాతావరణం, పరిస్థితుల గురించి చెబుతూ... మూడు వారాల పాటు షూటింగ్ కోసం వచ్చానని చెప్పాడు. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసమే బిగ్ బాస్ షోకు మధ్యలో డుమ్మా కొట్టేశాడు. ఈ మూవీ షూటింగ్ కోసం మనాలికి వెళ్లిన నాగ్.. దసరా స్పెషల్ ఎపిసోడ్‌ను సమంత చేతిలో పెట్టాడు. సమంత కూడా బాగానే నడిపించింది.
అయితే తాజాగా వైల్డ్ డాగ్ షూటింగ్‌కు నాగార్జున ముగింపు పలికినట్టు తెలిపాడు. నా పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఇంటికి వెళ్తున్నాను.. అద్భుతమైన వైల్డ్ డాగ్ టీంను మిస్ అవుతున్నాను.. ఎంతో ప్రశాంతమైన హిమాలయాలను మిస్ అవుతున్నాను అంటూ నాగ్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సెట్‌లో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. చూస్తుంటే తన టీంతో నాగార్జున బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.

మొత్తానికి ఈ వీకెండ్‌లో నాగార్జున బిగ్ బాస్ షోను దడదడలాడించబోతోన్నాడు. అయితే ఈ వైల్డ్ డాగ్ షెడ్యూల్ మళ్లీ హైద్రాబాద్‌లోనే ఉండబోతోందని తెలుస్తోంది. ఎన్ఐఏ ఏజెంట్‌గా నాగార్జున నటిస్తున్న ఈ మూవీని అశిషోరో సోలేమాన్ తెరెక్కిస్తుండగా.. అలీ రెజా, ఆర్య పండిట్, మాథ్యూ, రుద్రగౌడ్, దియా మీర్జా వంటి వారు నటిస్తున్నారు. మ్యాటీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











