twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెద్దపెద్ద వాళ్ళే వణుకుతున్నారు.. మనమెంత.. ఉ** పోయిస్తోంది: నాగబాబు షాకింగ్ కామెంట్స్

    |

    చైనా దేశం వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో జనం వణికిపోతున్నారు. మరోవైపు కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్నిదేశాల ప్రభుత్వాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. కాగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయమై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలేంటో చూద్దామా..

    హైదరాబాద్ చేరిన కరోనా వైరస్

    హైదరాబాద్ చేరిన కరోనా వైరస్


    దేశ దేశాలకు విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను సైతం భయపెడుతోంది. ఇటీవలే హైదరాబాద్ నగరాన్ని కూడా చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, ఢిల్లీ లాంటి మహానగరాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో తెలంగాణ సహా భారత ప్రజానీకం పలు జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది.

    అప్రమత్తమైన ఆరోగ్య శాఖ..

    అప్రమత్తమైన ఆరోగ్య శాఖ..

    కరోనాను చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు దాని ప్రభంజనం చూసి నోరెళ్లబెట్టే పరిస్థితి నెలకొంది. సినిమా హాల్స్, స్కూల్స్, కాలేజెస్ లాంటివి కూడా మూసేయాలని ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టే పనిలో పడింది.

    వేలాది మంది బలి.. కరోనా ఎఫెక్ట్ చూస్తుంటే!

    వేలాది మంది బలి.. కరోనా ఎఫెక్ట్ చూస్తుంటే!

    ఇప్పటికే వేలాది మందిని బలి తీసుకున్న కరోనా వైరస్ దేశవిదేశాల్లోని మార్కెట్లను దెబ్బతీస్తూ అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షా 25 వేల మందికి పైగా ఈ వైరస్ సోకిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

    ప్రపంచానికే సుస్సు (ఉచ్చ).. పెద్ద పెద్ద వాళ్ళే వణుకుతున్నారు

    ఈ నేపథ్యంలో కరోనా గురించి స్పందిస్తూ నాగబాబు కొన్ని ఆసక్తికర ట్వీట్స్ చేశారు. ''మనకన్నా అన్ని విధాలా బలహీనుడు, చిన్నవాడు,ఆని ఎవరినీ తక్కువగా చూడొద్దు. వైరస్ కూడా మనకన్నా చిన్నదే, అసలు కంటికే కనబడదు. కొన్నిసార్లు ప్రపంచానికే సుస్సు (ఉచ్చ) పోయిస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళే వణుకుతున్నారు.. మనమెంత. రెస్పెక్ట్ ఎవ్రీ వన్. కారోన అమ్మా మొగుళ్లు వచ్చిన ఆశ్చర్యపోకండి'' అని పేర్కొన్నారు.

    ఆయనే వాళ్ళను పంపించాడు

    ''కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే కారోన వైరస్ ని వాళ్ళ దేవుడే ఈ భూమి మీదకి పంపించాడు అని అంటున్నారు.అయినా ఈ దేవుళ్ళ కి కోపం ఎక్కువే సుమా'' అంటూ మరో సెటైరికల్ ట్వీట్ వదిలారు నాగబాబు. దీంతో ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

    ఒక్క మనిషి తప్ప అందరూ.. గతంలో కూడా

    ఒక్క మనిషి తప్ప అందరూ.. గతంలో కూడా

    కొద్ది రోజుల క్రిందట కూడా నాగబాబు కరోనాపై స్పందించిన సంగతి తెలిసిందే. ''సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయని, కరోనా వైరస్ సహా.. ఒక్క మనిషి తప్ప'' అని నాగబాబు పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ కామెంట్లు చూసి నెటిజన్లు ఆసక్తికరంగా స్పందించారు. 'ఆ మనుషుల్లో మీరు కూడా ఉన్నారు కదా?' అంటూ కామెంట్స్ చేశారు.

    Recommended Video

    Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic
    కరోనా ఎఫెక్ట్.. ఛార్మి క్షమాపణ

    కరోనా ఎఫెక్ట్.. ఛార్మి క్షమాపణ

    ఇటీవలే ఛార్మి సైతం కరోనాపై స్పందించి చివరకు సారీ చెప్పింది. ''కరోనా వచ్చింది.. ఆల్ ది బెస్ట్'' అంటూ వీడియో పోస్ట్ చేసి ఛార్మి చిక్కుల్లో పడింది. చాలామంది ఛార్మి వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీంతో చివరకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరింది ఛార్మి.

    English summary
    CoronaVirus entered in Hyderabd. Now mega brother Nagababu commented on this virus using social media platform.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X