ఆ భయమే వాళ్ళను చంపుతోంది.. నాగబాబు సంచలన కామెంట్స్.. కేసీఆర్ ముచ్చటతో కౌంటర్స్!!
మెగా బ్రదర్ నాగబాబుపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ ముచ్చటను వినిపిస్తూ ఆయన పెట్టిన ట్వీట్‌పై రియాక్ట్ అవుతున్నారు. తెలిస్తేనే మాట్లాడు.. లేదంటే మూసుకో అంటూ స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది. నాగబాబుపై ఈ అటాక్ ఎందుకోసం? వివరాల్లోకి పోతే..

బుల్లితెర వినోదం.. నాగబాబు స్పీడ్
గతే కొన్నేళ్లుగా బుల్లితెర వినోదాలు పంచడంలో బిజీ అయ్యారు నాగబాబు. జబర్దస్త్ వేదికగా ఏడేళ్ల పాటు హవా నడిపిన ఈ మెగా బ్రదర్.. ఇప్పుడు అదిరింది అంటూ కిక్కిస్తున్నారు. దీంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకుంటూ ఉండటం నాగబాబుకు అలవాటు.

గతంలో అలా.. ఇప్పుడు మరోసారి మెగా బ్రదర్
ఈ నేపథ్యంలోనే ఇటీవలే హాట్ ఇష్యూగా మారిన కరోనా వైరస్ గురించి స్పందించి నెటిజన్ల ట్రోల్స్‌కి గురయ్యారు నాగబాబు. గతంలో ఇదే కరోనా వైరస్‌పై స్పందిస్తూ.. ''సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయని, కరోనా వైరస్ సహా.. ఒక్క మనిషి తప్ప'' అని పేర్కొన్న ఆయన.. తాజాగా మరో ట్వీట్ చేసి పెద్ద సంచలనమే సృష్టించారు.

కరోనా వైరస్.. భారత దేశంలో కలకలం
గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌కు సంబంధించిన విషయాలు వైరల్ అవుతూ వస్తున్నాయి. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 100కు పైగా దేశాల్లో వ్యాప్తి చెంది వేలాది మంది మరణానికి కారణమైంది. ఇటీవలే భారత దేశంలో కూడా కరోనా కేసులు నమోదు కావడం కలకలం సృష్టించింది.

కరోనా ఎఫెక్ట్.. ఆ కారణంగానే చాలా మంది డెత్
''కరోనా వైరస్ వచ్చిందనే దానికంటే కూడా.. వస్తుందేమో అనే భయంతోనే ప్రపంచంలో చాలా మంది చనిపోతున్నారు'' అంటూ ట్వీట్ చేసాడు నాగబాబు. దీంతో ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. ఇది చూసి నెటిజన్లు నాగబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
కరోనా స్పెల్లింగ్ తప్పుగా రాశారు.. సరి చేయండి సర్ అంటూ కొందరు స్పందిస్తుండగా.. ఏం మాట్లాడుతున్నారు బాబు గారూ అంటూ ఇంకొందరు
సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే మొన్న అసెంబ్లీలో కరోనా గురించి కేసీఆర్ మాట్లాడిన వీడియో ట్యాగ్ చేస్తూ ఓ సారి ఇది చూడు అని పేర్కొంటుండటం విశేషం.
Recommended Video

కేసీఆర్ ముచ్చట.. పారాసెటమాల్ అంటూ!
కరోనా వచ్చినా కూడా ఎవడూ చచ్చిపోడు.. పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పడం నెట్టింట హాట్ ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసీఆర్ ముచ్చట తాలూకు వీడియోతో పాటు నాగబాబు ట్వీట్ మరింత చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











