Dangerous అమ్మాయితో రొమాన్స్ చేయడానికి కష్టపడ్డా.. ఆర్జీవి నా ఇష్టం గురించి నైనా

ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ప్రయోగానికి తెర లేపుతున్నారు. ఇప్పటి వరకు తెరకెక్కించని విధంగా తొలిసారి స్వలింగ సంపర్కుల ప్రేమ కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్లాన్ చేశారు. యువ హీరోయిన్లు అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మా ఇష్టం. ఈ సినిమా మిగితా భాషల్లో డేంజరస్ అనే టైటిల్‌తో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా ఇద్దరమ్మాయిల ప్రేమకథతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ, అప్సర రాణి, నైనా గంగూలీ, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ తో పనిచేయడం ఎంతో కిక్ ఇస్తుంది. ఇంతటి అద్భుతమైన సినిమా ని వేరే ఏ డైరెక్టర్ చేయలేడు అని సగర్వంగా చెబుతాను. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలున్నారు. మా సినిమా లో ఇద్దరు కత్తిలాంటి హీరోయిన్ లు, అర్జీవి గారు ఉన్నారు. ఈ సినిమా తప్పకుండా యాభై కోట్లు కలెక్షన్స్ సాధిస్తుంది. ఒక సినిమా హిట్ అవ్వడానికి ఏవైతే కావాలో అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి అన్నారు. అన్ని భాషల్లో ఈ సినిమా ఏప్రిల్ 8 న విడుదల కాబోతుంది. అన్నారు.

Naina Ganguly about RGVs Dangerous movie

హీరోయిన్ నైనా గంగూలీ మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మతో గతంలో చాలా సినిమాలు చేశాను. కానీ ఈ సినిమాలో నేను చేసిన లెస్బియన్ రోల్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటుంది. హీరో పక్కన నటించడం చాలా ఈజీ.. కానీ ఒక అమ్మాయితో రొమాన్స్ సీన్స్‌లో నటించడం చాలా కష్టం. ఈ సినిమాలో నటించడానికి మొదట్లో ఇబ్బంది పడ్డాను. కానీ ఆ తర్వాత యూనిట్ సహకారంతో బాగా చేయగలిగా. నటిగా ఎలాంటి పాత్రనైనా బాగా చేయాలనీ నమ్ముతా. అందుకే ఈ సినిమాను పూర్తి చేయగలిగా. ఈ సినిమా అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. మీ అందరు ఈ సినిమాను సపోర్ట్ చేసి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అన్నారు.

హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నటించడం ఆనందంగా ఉంది. వెరైటీ పాత్రలు చేయాలనేదే నా లక్ష్యం. అందుకే ఇలాంటి పాత్రలో నటించాను. ఈ కథ వినగానే చేయాలనిపించింది. ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏంటి అనేది ఈ సినిమా. ఆయన సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా ఎవరు ఊహించని విధంగా ఉంది. రొమాంటిక్ పాట లో చేయడం ఎంతో థ్రిల్ అనిపించింది. అందరికీ థాంక్స్. అన్నారు.

Naina Ganguly about RGVs Dangerous movie

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. మా ఇష్టం సినిమా ఒక క్రైమ్ డ్రామా మూవీ. అందులో లీడ్ పెయిర్ లెస్బియన్స్. ఆ పాత్రలలో నైనా గంగూలీ, అప్సర రాణి ఇద్దరు అద్భుతంగా నటించారు. అప్సర నటించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు కానీ నైనా ని ఒప్పించడానికి కొంత సమయం పట్టింది. ఇద్దరు కూడా ఆ పేరెంట్స్ తో మాట్లాడి ఈ సినిమా చేశారు. ప్రపంచంలోనే ఇద్దరు అమ్మాయిలతో రొమాంటిక్ పాట షూట్ చేయడం జరగలేదు. ఏప్రిల్ 8 తేదీన ఈ సినిమా రాబోతుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X