Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్‌స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్‌కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
గ్రాఫిక్స్‌తో షకీలా, నమిత.. క్రేజీగా మూవీ పేరు
ప్రేమిస్తే ఫేమ్ భరత్, నమిత, ఇనియా, ఊర్వశి, షకీలా ప్రధాన తారాగణంగా వి.సి.వడివుడయాన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం బొట్టు. మార్చి 8న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఎస్.ఎస్ సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జి.కుమార్ బాబు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా జి కుమార్ బాబు మాట్లాడుతూ - తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించిన కాంచన, గంగ చిత్రాల తరహాలోనే అదరగొట్టే గ్రాఫిక్స్‌తో వస్తోన్న మరో హారర్ కామెడీ యాక్షన్ చిత్రమిది. బొట్టు అనే పేరు గల ఓ గిరిజన యువతి కథ ఇది. కథాకథనాలు చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ మాయాజాలం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని అన్నారు.
సెన్సార్ ఇబ్బందుల కారణంగా చాలా రోజులుగా సినిమా విడుదల నిలిచిపోయింది. చివరకు, రివైజింగ్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ పొందాం. మన తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే ఉద్దేశంతోనే ఈ చిత్రం విడుదల హక్కులను మేం తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సహా విడుదలకు సిద్ధంగా ఉన్నాం అని కుమార్ బాబు తెలిపారు.
తంబిరామయ్య, సాయాజీ షిండే, మొట్ట రాజేందర్, మన్సూర్ అలీఖాన్, నిరోషా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్, కెమెరా: ఎనియాన్ జె. హ్యారీస్, మాటలు: ఎం.రాజశేఖర్‌రెడ్డి, ఫైట్స్: సూపర్ సుబ్బరాయన్, ఎడిటర్: ఎలీనా, పాటలు: శివగణేష్.