Namrata Shirodkar: వెండితెర రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన మహేష్ సతీమణి.. వాళ్ళు అడిగారు అంటూ..

ఒకసారి పెళ్లి జరిగిన తరువాత స్టార్ హీరోయిన్స్ చాలా వరకు సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఒకవేళ చేసినా కూడా గతంలో తరహాలో గ్లామర్ పాత్రలు లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ ఉంటారు. ఏదైనా ముఖ్యమైన పాత్ర నచ్చితే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక మరికొందరు అయితే పెళ్లి తర్వాత కూడా ఒకే తరహాలో హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఇక మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా గతంలో చాలా వార్తలు వచ్చాయి ఇక ఆ వార్తలపై నమ్రత ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మోడల్ గా మంచి గుర్తింపు

మోడల్ గా మంచి గుర్తింపు

మొదట మోడల్ గా మంచి గుర్తింపును అందుకున్న నమ్రతా శిరోద్కర్ ఫ్యాషన్ ప్రపంచంలో పలు కిరీటాలను కూడా సొంతం చేసుకుంది. మిస్ ఇండియా యూనివర్స్ గా 1993లో విజేతగా నిలిచారు ఆ తర్వాత ఏషియా మిస్ ఇండియా పోటీల్లో కూడా ఆమె మరో కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఆమె సినిమా కెరీర్లో కి రావడానికి పెద్దగా సమయం పట్టలేదు. 1998లో హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

మహేష్ తో సినిమా

మహేష్ తో సినిమా

ఇక భాషతో సంబంధం లేకుండా నమ్రతా శిరోద్కర్ 2024 వరకు తెలుగు హిందీ తమిళం మలయాళం ఇలా విభిన్నమైన భాషల్లో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. 2000వ సంవత్సరంలో మొదటి సారి మహేష్ బాబు తో వంశీ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేదు కానీ మహేష్ బాబు తో మాత్రం ఆమెకు స్పెషల్ బాండింగ్ ఏర్పడింది.

 చివరి సినిమా

చివరి సినిమా

ఇక చివరగా ఆమె నటించిన అంజి సినిమా చాలా ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2004 వరకు నమ్రతా శిరోద్కర్ వరుసగా హిందీ లో కూడా కొన్ని సినిమాల్లో చేసుకుంటూ వచ్చింది సినిమా హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ ఏమీ అందుకోలేకపోయింది. ఇక మహేష్ బాబు తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. అనంతరం 2005లో ఆమెను మహేష్ బాబు పెళ్లి చేసుకున్నారు.

అలా భర్తకు సలహాలు

అలా భర్తకు సలహాలు

ఇక పెళ్లి తర్వాత నమ్రతా శిరోద్కర్ పూర్తిగా సినిమాలను వదిలేశారు. కేవలం మహేష్ బాబుకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో తనదైన శైలిలో సలహాలు ఇవ్వడమే కాకుండా మహేష్ బాబు నేషనల్ లెవల్లో ఇతర కమర్షియల్ యాడ్స్ లో నటించే విధంగా ఆమె కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ముంబైకు చెందిన కొన్ని ప్రముఖ కంపెనీల తో ఆమెకు మంచి పరిచయాలు ఉండడంతో మహేష్ బాబు కూడా చాలా ఈజీగా నేషనల్ బ్రాండింగ్ యాడ్స్ లో నటించాడు

రీ ఎంట్రీకి ప్లాన్ అంటూ..

రీ ఎంట్రీకి ప్లాన్ అంటూ..

అయితే నమ్రత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించింది లేదు. ఇక చాలా కాలం తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అని కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. హీరోయిన్ గా కాకుండా తల్లి పాత్రలలో అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాత్రలలో సింపుల్ గా నటించేందుకు నమ్రత ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా వచ్చింది.

క్లారిటీ ఇచ్చిన నమ్రత

క్లారిటీ ఇచ్చిన నమ్రత

అయితే రీసెంట్ గా నమ్రత తనపై వస్తున్న వార్తలన్నిటికీ కూడా ఒకేసారి క్లారిటీ ఇచ్చేసింది. ఇటీవల తన స్నేహితురాలు ఒకరు స్టైలింగ్ స్టోర్ ప్రారంభోత్సవంకు వచ్చిన నమ్రత అక్కడ మీడియా ముందు కొన్ని విషయాల గురించి మాట్లాడింది. ముఖ్యంగా తన రీ ఎంట్రీ పై కూడా వివరణ ఇచ్చింది. నిజానికి తనను మళ్లీ నటించాలని చాలా మంది అడుగుతున్నారు. కానీ ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యత తో చాలా బిజీగా ఉన్నాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే సినిమాల్లో నటించాలని అనుకోవడంలేదు. భవిష్యత్తులో కూడా ఆలోచన ఉండకపోవచ్చునని నమ్రత కుండ బద్దలు కొట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X