నమ్రత తెలివి చూశారా..! ఏకంగా విజయ్ దేవరకొండతో.. ఎప్పుడు కుదిరిందో కానీ!

మహేష్ బాబు సతీమణి, హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ఎప్పుడూ ప్రత్యేకమే. స్టార్ హీరో భార్య, హీరోయిన్ అయినప్పటికీ సింపుల్ లుక్ లోనే దర్శనమిస్తూ తెర వెనుక మహేష్ కు ఎంతో అండదండగా ఉంటుంది. మహేష్ సినిమా ప్రమోషన్స్, బిజినెస్ వ్యవహారాలు ఎక్కువగా నమ్రతనే హాండిల్ చేస్తుంటుంది. ఇప్పటికే మహేష్, నమ్రతలు కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట భారీ మల్టిప్లెక్స్ అలాగే జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యానర్‌పై తెరకెక్కించనున్న సినిమాల విషయంలో నమ్రత అన్నీ తానై చూసుకుంటూ చాలా తెలివిగా అడుగులేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు విజయ్ దేవరకొండతో నమ్రత భారీ స్కెచ్చే వేసిందని అంటున్నారు. వివరాల్లోకి పోతే..

సినిమాలే కాదు బిజినెస్ ప్లాన్స్ కూడా

సినిమాలే కాదు బిజినెస్ ప్లాన్స్ కూడా

మహేష్ బాబు అందరు స్టార్స్‌లా కేవలం సినిమాలతోనే గాక బిజినెస్ మాన్‌గా కూడా రాణించాలని నమ్రత బలంగా కోరుకుంటోందట. ఈ నేపథ్యం లోనే మహేష్ సినిమాలతో బిజీగ ఉంటే ఆయన బిజినెస్ వ్యవహారాలన్నీ నమ్రతనే దగ్గరుండి చూసుకుంటోందట. అంతేకాదు బిజినెస్ లో సరికొత్తగా ఆలోచిస్తూ ట్రెండ్‌కి తగ్గ బిజినెస్ ప్లాన్స్ వేసి మహేష్ బాబు ముందుకు తీసుకొస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్

జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్

ఇన్నాళ్లు కుటుంబ బాధ్యతలు మోసిన నమ్రత.. కొడుకు గౌతమ్, కూతురు సితార కాస్త పెద్దవాళ్లు కావడంతో ఇప్పుడు జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి సంబంధించి పూర్తి బాధ్యతను తవ భుజాల పైనే వేసుకుందట. ఈ మేరకు మహేష్ కెరీర్ లో రాబోతున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు` లో జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పెట్టుబడులు పెడుతూనే.. ఈ బ్యానర్ పై ఇతర యువహీరోలతో సినిమాలు తీయాలని ప్లాన్ చేసిందట నమ్రత.

ఇప్పటికే హీరో అడివి శేష్‌తో కమిట్

ఇప్పటికే హీరో అడివి శేష్‌తో కమిట్

ఇప్పటికే గూఢచారి ఫేం అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు నిర్మాణ బాధ్యతలు జీ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ చేపట్టింది. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి ఆరకముందే.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా మహేష్ బ్యానర్ లో ఓ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

నమ్రత తెలివిగా.. ఏకంగా విజయ్ దేవరకొండతో

నమ్రత తెలివిగా.. ఏకంగా విజయ్ దేవరకొండతో

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయనతో సినిమాలు రూపొందించిన నిర్మాతలందరికీ లాభాల పంట పండింది. ఇది గమనించిన నమ్రత.. తమ బ్యానర్‌లో విజయ్ దేవరకొండతో సినిమా రూపొందించి ఇటు మహేష్ ఇమేజ్, అటు విజయ్ దేవరకొండ ఇమేజ్ ని సొమ్ము చేసుకోవాలని చాలా తెలివిగా స్కెచ్ వేసిందని టాక్.

మహేష్ బాబు, విజయ్ దేవరకొండ కలయిక

మహేష్ బాబు, విజయ్ దేవరకొండ కలయిక

గతంలో ఓ పార్టీలో విజయ్ దేవరకొండ ఎవ్వరూ ఊహించని విధంగా మహేష్ బాబుతో కనిపించడంతో షాకైన జనం.. మహేష్ 26 లో విజయ్ నటించనున్నాడని చెప్పుకున్నారు. కానీ ఆ సినిమా ఇప్పటికే స్టార్ట్ కావడంతో అందులో విజయ్ లేదని క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఆ కలయిక మహేష్ బ్యానర్ లో విజయ్ సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడనే దానికి సూచిక అని లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

 ఇంతకీ కుదిరేనా..?

ఇంతకీ కుదిరేనా..?

నమ్రత ప్లాన్ బాగానే ఉంది గానీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా అలాగే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేసి బిజీగా ఉన్నాడు. ఈ బిజీ షెడ్యూల్ లో అతను మహేష్ బ్యానర్ లో సినిమా చేయడమంటే కష్టమే మరి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X