సితార క్యూట్ స్టెప్స్.. వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉంటుందో.. సితారకు కూడా అదే స్థాయిలో ఉంటుంది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక సీతూ పాప వేసే డ్యాన్సులు, ముద్దు ముద్దు మాటలు, క్యూట్ స్టెప్ప్‌కు ఫిదా కానివారెవరూ ఉండరు. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న సందర్భంగా నమ్రతా శిరోద్కర్ నాటి మెమోరీస్‌ను మళ్లీ పోస్ట్ చేస్తోంది.
ఈ క్రమంలో వన్ నేనొక్కడినే, ఆగడు చిత్ర షూటింగ్‌లో గౌతమ్, సితార చేసిన అల్లరిని, అప్పటి వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు క్కిక్కిస్తోంది. అసలే సీతూ పాప డ్యాన్స్‌లకు సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. అందే ఓ ఐదారేళ్ల క్రితం బుల్లి సితార కాళ్లు చేతులు కదుపుతూ ఉంటే ఇంకెంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నమ్రత షేర్ చేసింది.

మహేష్ బాబు పాటలకు సితార వేసే డ్యాన్సులు ఎంతగానే ఫేమస్. ఇటీవలె డ్యాంగ్ డ్యాంగ్ అంటూ సితార వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.తమన్నాను మరిపించేలా సీతూపాప డ్యాన్స్ చేసిందనే కామెంట్స్ వచ్చాయి.తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో బుల్లి సితారు ఆగడు సినిమాలోని పాటలకు ఆన్ లొకేషన్‌లో స్టెప్పులేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడీ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











