దసరా సెలవులు..మళ్లీ విదేశాలకు చెక్కేస్తున్న మహేష్ ఫ్యామిలీ..
నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులను పలకరిస్తూ ఉంటారు. సూపర్ స్టార్ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. తాజాగా సితార, గౌతమ్ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. మరో అప్ డేట్ ఇచ్చేసింది.
సెలవులు వచ్చినా, సినిమా షూటింగ్స్లో విరామం దొరికినా.. ఫ్యామిలీ ట్రిప్ వేస్తుంటాడు మహేష్ బాబు. అయితే ఇప్పుడు దసరా హాలీడే వచ్చశాయ్.. మేమంతా టూర్ కు వెళ్తున్నామని పేర్కంది. అయితే ఈ ఫోటోలో సితార తనఅన్న గౌతమ్ ను ముందుకు తోస్తూ ఉంది. అయితే వీరంతా ఎక్కడికి వెళ్తున్నాడన్నది మాత్రం అందులో పేర్కొనలేదు.

మళ్లీ త్వరలోనే వస్తాము అని మాత్రం తెలిపింది. అయితే ఈ టూర్లో.. మహేష్ ఉన్నాడా? లేదా? అన్నది తెలియడం లేదు. మహేష్ బాబును వదిలేసి.. ఈ ముగ్గురే వెళ్లే చాన్స్ లేదని ప్రిన్స్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నమ్రతా సోదరి అయిన శిల్పా శిరోద్కర్ మాత్రం ఈ పోస్ట్ కు కామెంట్ పెడుతూ.. బాగా ఎంజాయ్ చేయండని తెలిపింది. మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కర్నూలు కొండారెడ్డి బుర్జు సెంటర్ సెట్లో జరుపుతున్న షూటింగ్లో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











