సమంత.. ఓ సారి ఇటుచూడు.. మహేష్ బాబు సతీమణి నమ్రత వైరల్ పోస్ట్

సోషల్ మీడియా పరిధి రోజురోజుకూ విస్తృతం కావడంతో సెలెబ్రిటీలు, సామాన్య ప్రజల మధ్య దూరం చాలా వరకు తగ్గిపోతోంది. ఎప్పటికప్పుడు తమ అభిమాన నటీనటుల విశేషాలు నెటిజన్ల ముందుకు రావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేర్లు సమంత, నమ్రత. అలాంటి ఈ ఇద్దరి మధ్యనే తాజాగా ఓ ఇష్యూ వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దామా..

నాగార్జున పుట్టినరోజు నిమిత్తం పొరుగు దేశంలో సమంత

నాగార్జున పుట్టినరోజు నిమిత్తం పొరుగు దేశంలో సమంత

నాగార్జున పుట్టినరోజు వేడుక నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. నాగచైతన్య, సమంత, అఖిల్‌, నాగార్జున, అమల తదితరులు ఐబిజా ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా టూర్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌, అక్కడ దిగిన ఫొటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వస్తోంది.

భర్త నాగ చైతన్య కౌగిలిలో సమంత

ఇందులో భాగంగా తాజాగా తన భర్త నాగచైతన్యను ఆలింగనం చేసుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమంత. అందమైన లొకేషన్.. అందునా యంగ్ కపుల్స్ యమ క్యూట్‌గా కనిపిస్తుండటంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పిక్ చూసి అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఎంటరైన మహేష్ బాబు సతీమణి నమ్రత

అయితే ఈ ఫొటో చూసిన మహేష్ బాబు సతీమణి నమ్రత వెంటనే తనదైన శైలిలో రియాక్ట్ అయింది. మహేష్ బాబును ఆలింగనం చేసుకున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. సమంత పేరుని ట్యాగ్ చేసింది నమ్రత. అంతేకాదు ''సేమ్ సేమ్'' అని క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. దీంతో ఈ సీనియర్ కపుల్ పిక్ కూడా వైరల్ అయింది.

 సమంత రియాక్షన్ చూశారా

సమంత రియాక్షన్ చూశారా

నమ్రత, మహేష్ బాబు ఫోటో చూశాక సమంత కూడా వెంటనే రియాక్ట్ అయింది. 'మీ ఇద్దరూ బెస్ట్ కపుల్' అని నమ్రత, మహేష్ లకు కాంప్లిమెంట్ ఇచ్చేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా సంభాషణ, సిమిలర్ పిక్స్ ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇచ్చాయి. మహేష్ బాబు, సమంత జంటగా ‘దూకుడు', ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాల్లో నటించారు.

మహేష్ బాబు 26వ సినిమా

మహేష్ బాబు 26వ సినిమా

ప్రస్తుతం మహేష్ బాబు తన 26 వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X