పెను ప్రమాదం నుంచి తప్పించుకొన్న బాలకృష్ణ.. హిందూపురంలో ఏం జరిగిందంటే?

సినీ నటుడు, నటసింహం, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ఖ తృటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకొన్నారు. హిందూపురంలో ప్రచారం చేపట్టిన ఆయన వాహనంపై ఉండగా భారీ కుదుపుకు లోనయ్యారు. దాంతో ఆయన వాహనంపై నుంచి పడిపోయే పరిస్థితుల్లో కార్యకర్తలు, నేతలు పట్టుకొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి.. అనే కార్యక్రమం ఏపీలోని అన్ని జిల్లాలో కొనసాగుతున్నది. అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన చేపట్టిన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. అయితే వాహనంపై ప్రచారం చేస్తూ తనదైన శైలిలో ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

Nanadamuri Balakrishna escaped from Road accident in Hindupur

ఈ క్రమంలో వాహనంపై నిలబడి కార్యకర్తలకు అభిమానులకు అభివాదం చేస్తుండగా.. వాహనం కుదుపుకు గురైంది. దాంతో బ్యాలెన్స్ కోల్పోయిన బాలకృష్ణ వాహణంపైనే కుప్పకూలాడు. వాహనంపై కుప్పకూలగానే.. రెండు వైపుల కార్యకర్తలు ఆయనకు రక్షణగా నిలిచారు. ఆయన వాహనంపై నుంచి పడి ఉండే భారీ ప్రమాదమే జరిగి ఉండేదని కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు గురయ్యారు.

ప్రమాదం నుంచి తేరుకొన్న బాలకృష్ణ.. అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌కు వైన్, మైన్, ఇసుక తప్ప ప్రజల గోడు పట్టడం లేదని బాలకృష్ణ ఆరోపించారు.

పెను ప్రమాదం నుంచి తప్పించుకొన్న బాలకృష్ణ మళ్లీ యదావిధిగా తన ప్రచారం యాత్రను కొనసాగించారు. ఆ తర్వాత ఏపీ సర్కారుపై నిప్పులు చెరుగుతూ.. ముందుకెళ్లారు.

ఇక బాలకృష్ణ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం తొలివారంలోనే 100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాలకృష్ణ సినిమా కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X