#MegastarKalyanram మెగాస్టార్ చిరంజీవి కాదు.. కల్యాణ్ రామ్.. బింబిసార హిట్‌తో నందమూరి ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్

నందమూరి ఫ్యామిలీ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ చేరింది. కల్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నది. అయితే తమ హీరోలు సక్సెస్ అందుకొన్న నేపథ్యంలో నందమూరి అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అయితే చిరంజీవి, మెగా ఫ్యాన్స్‌పై నందమూరి అభిమానులు ట్రోల్స్ చేయడం వివాదంగా మారింది. అయితే నందమూరి ఫ్యాన్స్ చేస్తున్న దారుణమైన ట్రోల్స్ విషయంలోకి వెళితే..

 #MegastarKalyanRam హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్

#MegastarKalyanRam హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్

బింబిసార సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత ట్విట్టర్‌లో #bimbisara హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే #MegastarKalyanRam అనే హ్యాష్ ట్యాగ్‌ను నందమూరి అభిమానులు ట్రెండింగ్ చేశారు. అయితే బింబిసార సినిమాకు సంబంధించిన విషయాలపై ట్రెండింగ్ చేస్తే బాగుండేది. కానీ మెగా ఫ్యామిలీని దారుణంగా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది.

బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ


మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ. స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు బాస్ భారీ డిజాస్టర్ ఇచ్చాడు. నూతన దర్శకులకు కల్యాణ్ రామ్ బ్లాక్‌బస్టర్లు ఇచ్చాడు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ అఖండలోని బాలకృష్ణ డైలాగ్‌తో ట్రోల్ చేశారు. టాలీవుడ్‌కు మెగాస్టార్ కల్యాణ్ రామ్ అంటూ ట్వీట్లతో హోరెత్తించారు.

నెగిటివ్ స్పెడ్ చేయకండి


మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ.. బింబిసారపై నెగిటివ్ టాక్ స్పెడ్ చేయకండి.. అంటూ ఓ మీమ్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మెగాస్టార్ కల్యాణ్ రామ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.

చిరంజీవిపై ట్రోల్ ఇలా..


బింబిసార హిట్ తర్వాత ఆ సినిమా హక్కుల కోసం రీమేక్ స్టార్ చిరంజీవి మెగాస్టార్ కల్యాణ్ రామ్‌ను అప్రోచ్ అయ్యాడు. సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కల్యాణ్ రామ్ బిజీగా ఉండి.. చిరంజీవిని తర్వాత కలుద్దామని అని చెప్పాడంటూ నందమూరి ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

నిజమైన మెగాస్టార్ కల్యాణ్ రామ్


థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో చిరంజీవి, రాంచరణ్ ఫెయిల్ అయ్యారు. కానీ బింబిసారతో కల్యాణ్ రామ్ ఆడియెన్స్‌ను థియేటర్‌కు రప్పిస్తున్నారు. నిజమైన మెగాస్టార్ కల్యాణ్ రామ్ అంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.

నందమూరి ఫ్యాన్స్‌దే క్రెడిట్


బింబిసారలో కిడ్ సెంటిమెంట్ సూపర్. తారక్, కల్యాణ్ రామ్, బాలకృష్ణ బ్లాక్‌బస్టర్లను ఇచ్చారు. #MegastarKalyanRam అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. కోవిడ్ పరిస్థితుల తర్వాత బాలయ్య, తారక్, కల్యాణ్ రామ్ భారీ విజయాలను ఇండస్ట్రీకి ఇచ్చారు అంటూ తమ హీరోలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

కొత్త మెగాస్టార్ కల్యాణ్ రామ్

కొత్త మెగాస్టార్ కల్యాణ్ రామ్


బింబిసార తొలి రోజు కలెక్షన్లు 6.85 కోట్లు సాధించింది. నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్, గతంలో ఇజం సినిమాకు తొలి రోజు వసూళ్లు 3.15 కోట్లు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. భారీ వర్షాలు, కరోనా ఎఫెక్ట్ ఉన్నా సరే ప్రేక్షకులను కల్యాణ్ రామ్ థియటర్‌కు రప్పించాడు. టాలీవుడ్‌కు కొత్త మెగాస్టార్ నందమూరి కల్యాణ్ రామ్ అంటూ ట్వీట్లు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X