HBD Balakrishna : బాలయ్య ఫ్యాన్సా మజాకా.. ఏకంగా వ్యాక్సినేషన్ కూడా మొదలెట్టేశారుగా!

నటసింహ నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అభిమానులు. కరోనా కారణంగా పెద్దగా వేడుక లాంటివి ఏమీ చేయవద్దని బాలయ్య కోరడంతో ఈసారి కాస్త సెలబ్రేషన్స్ డోస్ తగ్గించినా సరే సామాజిక కార్యక్రమాల విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గకుండా వారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ తన పుట్టినరోజు నాడు కేక్ కూడా కోయవద్దని ఆ కేకు డబ్బులతో ఎవరైనా అవసరమైన వారికి సహాయం చేయమని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో ముందున్నారు.

ఇక తాజాగా ఆయన 61వ జన్మదిన వేడుకలను కూకట్పల్లి బాలకృష్ణ ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు. యిన్నమూరి గోపీచంద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్ ఆవరణలో సుమారు 700 మంది నిరుపేదలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించారు. ఇక బాలకృష్ణ జన్మదిన వేడుకలతో పాటు ఈ ఉచిత వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు కూకట్పల్లి కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 Nandamuri Bala Krishna Fans conduct Free Vaccination Camp drive at Kukatpally Bramaramba Theater

ఇక వీరు మాత్రమే కాక సినిమా రంగం నుంచి బాలకృష్ణ 107వ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని ఆ సినిమా నిర్మాత మైత్రి మూవీస్ సంస్థ అధినేత ఎలమంచిలి రవిశంకర్, అలాగే 14 రీల్స్ సంస్థ అధినేత రామ్ ఆచంట హాజరయ్యారు. ఇక బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 Nandamuri Bala Krishna Fans conduct Free Vaccination Camp drive at Kukatpally Bramaramba Theater

ఇక ఈ కార్యక్రమమనే కాదు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాలకృష్ణ అభిమానులు నిత్యావసరాల పంపిణీ మొదలు అనేక విధాల సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రస్తుత తరుణంలో కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా దొరకని నేపథ్యంలో దాదాపు 700 మంది నిరుపేదలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడం అనేది మామూలు విషయం కాదని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X