దక్షిణాది సినీ పరిశ్రమకు దక్కిన గౌరవం.. విజయేంద్రప్రసాద్, ఇళయరాజాకు బాలకృష్ణ అభినందనలు

సినీ ప్రముఖులను పెద్దల సభ, ఎగువ సభ, రాజ్యసభకు నామినేట్ చేయడం కొత్తేమీ కాదు.. అయితే ప్రస్తుతం సంగీత మాంత్రికుడు ఇళయరాజాను, అలాగే బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఆదరణను సంపాదించుకొన్న సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం కొన్ని వర్గాలకు ఆశ్చర్యం కలిగించినా.. వారిద్దరికి సరైన గౌరవం, గుర్తింపును ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇళయ రాజా, విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

క్రియేటివ్ జీనియస్ ఇళయరాజా ఎన్నో తరాలను తన సంగీతం మంత్రముగ్దుల్ని చేశారు. ఆయన సంగీతం ఎన్నో రకాల ఎమోషన్స్ పలికించింది. ఇళయరాజా సంగీతమే కాకుండా ఆయన జీవితం కూడా స్పూర్తిదాయకంగా నిలిచింది. సాధారణ జీవితం నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం అందరికి స్పూర్తిదాయకం. అందుకే ఆయన సేవలను గుర్తించి రాజ్యసభకు నామినేట్ చేశాం అని ప్రధాని మోదీ తన ప్రకటనలో తెలిపారు.

 Nandamuri Balakirshna congratulates Ilaiyaraaja, V Vijendra Prasad for Rajyasabha nominations

అలాగే సినీ రచయిత వీ విజయేంద్ర ప్రసాద్ గురించి మోదీ ట్వీట్ చేస్తూ.. పలు దశాబ్దాలుగా సినీ పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. తన రచనల ద్వారా దేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. రాజ్యసభకు నామినేట్ అయిన సమయంలో ఆయనకు నా అభినందనలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

తెలుగు, తమిళ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, వీ విజయేంద్ర ప్రసాద్‌కు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. తెలుగుచిత్ర పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఉన్న వీరిద్దరూ పెద్దలసభకు నామినేట్ కావడం తెలుగు సినీపరిశ్రమకు గర్వకారణమని అన్నారు. తెలుగుసినిమా గొప్పతనాన్ని ఖండాంతరాలకు చేర్చిన ఘనత విజేయేంద్రప్రసాద్‌కు దక్కితే... సుస్వరాలతో కేవలం తెలుగువారికేగాక దక్షిణాదిలో కోట్లాది సంగీతాభిమానులకు వీనులవిందు చేస్తున్న ఇళయరాజాలకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం సముచితమైన నిర్ణయమని తెలిపారు. ఈ గౌరవం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవమని అంటూ వారిని ఎంపిక చేసినందుకు కేంద్రప్రభుత్వానికి కృతజ్జతలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X