NBK 107 లేటెస్ట్ మాస్ లుక్.. వేట మొదలైంది.. నల్లటి చొక్కాలో బాలయ్య లుక్కు మామూలుగా లేదు!

అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం క్రియేట్ చేసిన నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాలతో కూడా అంతకుమించి విజయాలను అందుకోబోతున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న 107వ సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇక గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో మాస్ కమర్షియల్ అంశాలతో బాలయ్య బాబు ను తనదైన శైలిలో చాలా విభిన్నంగా చూపించబోతున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు షూటింగ్ సంబంధించిన బాలయ్య ఫోటో లీక్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు లో ఆ పాత్రకు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు.

బాక్సాఫీస్ కాంబినేషన్

బాక్సాఫీస్ కాంబినేషన్


అఖండ సినిమాతో బాలకృష్ణ భారీ స్థాయిలో విజయాన్ని అందుకుని ఫామ్ లోకి వచ్చేసాడు. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా క్రాక్ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకొని స్టార్ దర్శకుడిగా క్రేజ్ అందుకున్నాడు. ఇక వీరి కలయికలో మొదటిసారి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోతున్నాయి. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం సృష్టిస్తోంది అని చెప్పవచ్చు.

నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా

నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నందమూరి బాలకృష్ణ 107వ సినిమాను తెరపైకి తీసుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమా కథను దర్శకుడు కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్నట్లు ఇండస్ట్రీలో ఒక టాక్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే కన్నడ సినిమా కూడా రీమేక్ అని కూడా కథనాలు వెలువడ్డాయి.

ఫొటో లీక్..

ఫొటో లీక్..

ఇక ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని నందమూరి బాలకృష్ణతో ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ను షూట్ చేసినట్లు సమాచారం. షూటింగ్ జరుగుతూ ఉండగా బాలయ్య కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది.. నల్లటి చొక్కా లో బాలయ్య బాబు ఊర మాస్ లుక్ తో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీంతో ఫోటో సోషల్ మీడియాలో చాలా ఈజీగా అయిపోయింది.

 ఊర మాస్ లుక్

ఊర మాస్ లుక్

అయితే ఆ ఫోటో లీక్ అవ్వగా.. నేడు చిత్ర యూనిట్ సభ్యులు స్పెషల్ గా అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేయడం విశేషం. నందమూరి బాలకృష్ణను మాస్ లుక్లో చూపించడం అంటే అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చినట్లే అని చెప్పవచ్చు. ఇక గోపీచంద్ మలినేని గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక నల్లటి చొక్కాలో చాలా పవర్ఫుల్ గా బాలయ్యను ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గాగుల్స్ పెట్టుకొని బాలయ్య లుంగిలో ఊర మాస్ పాత్రలో హైలెట్ అవుతున్నాడు.

Recommended Video

NBK 106 : Reason Behind Nandamuri Balakrishna New Look
వేట మొదలుపెడితే..

వేట మొదలుపెడితే..

అంతేకాకుండా సినిమాలు బాలకృష్ణను రెండు విభిన్నమైన పాత్రలో చూపించబోతున్నారు సమాచారం. ఒక పాత్ర రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అతను వేట మొదలు పెడితే చాలా వైల్డ్ గా ఉంటుందట. అఖండ అనంతరం ఈ సినిమా కూడా బాలయ్య బాబు కెరీర్లో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X