మొత్తానికి సెట్టయిన బాలకృష్ణ - త్రివిక్రమ్ కాంబినేషన్.. వచ్చేది ఎప్పుడంటే?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాని కంప్లీట్ చేసి దసరాకి ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ కథాంశం తోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఈ చిత్రంలో బాగానే ఉంటుందనే మాట వినిపిస్తుంది.
తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ లో బాబీ దర్శకత్వంలో 109 చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ లో యాక్షన్ ఎలివేట్ చేసే విధంగానే గొడ్డలితో పాటు మరికొన్ని వెపన్స్ ని కూడా ఒక బాక్స్ లో పెట్టి చూపించారు. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.

త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తే చూడాలని అభిమానులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో మూవీ ఉంటుందని ప్రచారం కూడా నడిచింది. అయితే బాలయ్య సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం చేయకపోయిన నిర్మించే ఛాన్స్ మాత్రం దక్కింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ లో వచ్చిన ఏ సినిమా కథ విషయంలో అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ కచ్చితంగా ఉంటుంది. సినిమా కథనం లేదా డైలాగ్స్ విషయంలో సహకారం కూడా అందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎన్బీకె 109 చిత్రానికి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో ఒక విధంగా సహకారం అందించి ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది.
ఒకవేళ ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు రాస్తే మాత్రం ఖచ్చితంగా మూవీకి మంచి హైప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి నిర్మాతగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్బీకె 109 సినిమా విషయంలో ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











