NBK 110: ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్... బాలయ్య కొత్త మూవీ పోస్టర్ లీక్!
నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో ఫుల్ జోష్ మీద ఉంటూ.. వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన అఖండ నుంచి మొదలు పెట్టిన విజయపరపర.. కొనసాగుతూ వస్తోంది. దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమా హంగామా ముగియక ముందే... ఆయన నెక్ట్స్ మూవీ అప్డేట్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ చక్కర్లు కొడుతుంది. ఈ పోస్టర్ చూసిన నెటిజన్స్... బాలయ్య నెక్ట్స్ మూవీ పక్కా హిట్టు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఆ పోస్టర్ ఏంటి.. నిజంగానే ఎన్బీకే 110 పోస్టర్ రిలీజ్ అయిందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలయ్యకు ఇటీవల మంచి కాలం నడుస్తుంది. ఆయన అఖండ నుంచి హిట్టు మీద హిట్టు కొడుతూ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. అఖండ తర్వాత వీరసింహారెడ్డి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టు ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుసగా వంద కోట్లు కలెక్ట్ చేసిన మూవీస్ బాలకృష్ణవి కావడం గమనార్హం.

ఇక ఆయన నెక్ట్స్ మూవీ 109 బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక భగవంత్ కేసరి సినిమా అయ్యాక.. బాలయ్య క్లీన్ షేవ్ తో కనిపించాడు. దానికి కారణం ఈ సినిమా కోసమే అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఇక ఈ నేపథ్యంలోనే బాలయ్య 110 మూవీ పోస్టర్ అంటూ ఒక పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ పోస్టర్ చూస్తుంటే.. బాలయ్య యుద్ధభూమిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పోస్టర్ చూడగానే శాతకర్ణి లుక్ గుర్తుకు వస్తుంది. ఇక శాతకర్ణి లాంటి మూవీ తీయనున్నారా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ పోస్టర్ కు బ్యాటిల్ ఆఫ్ బ్రీత్స్ అంటూ ట్యాగ్ కూడా పెట్టారు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఎన్బీకే 110 మూవీ పోస్టర్ లీక్ అంటూ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే నిజానికి ఇది ఓ క్రికెట్ కు సంబంధించిన పోస్టర్ అని కొంత మంది అంటున్నారు. ఇలాంటి ట్యాగ్ తోనే.. కిచ్చ సుదీప్ పోస్టర్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అన్ని భాషలా ఫిలిం ఇండస్ట్రీలు కలిసి... క్రికెట్ ఆడుతున్నారని.. అందుకే ఆ పోస్టర్ అలా పెట్టారని కొంత మంది అంటున్నారు.

ఇక ఈ పోస్టర్ మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది సినిమా పోస్టర్ లేదా.. క్రికెట్ పోస్టర్ అనేది క్లారిటీ లేదు. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఇది సినిమా అప్డేట్ అయితే బాగుండు అనుకుంటున్నారు. ఇక బాలయ్య 110 మూవీ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











