బాలయ్యనే వెయిట్ చేయించిన స్టార్ హీరో .. పలకరించినా తల తిప్పేసి
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ , నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా అనతికాలంలోనే ప్రశంసలు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రి పేరును నిలబెట్టారు. టాలీవుడ్‌ను దశాబ్థాలుగా మోస్తున్న నలుగురు అగ్రహీరోలలో ఒకరిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా తన ముద్ర వేశారు. సినీ రంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో బాలకృష్ణను సత్కరించింది. అలాంటి బాలయ్యను ఓ హీరో ఇబ్బంది పెట్టాడట. ఈ వివరాల్లోకి వెళితే..
100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలో దాదాపు 50 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న అతికొద్ది మంది నటుల్లో బాలకృష్ణ ఒకరు. సినిమాలతో పాటు రాజకీయాల్లో ప్రవేశించి హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు.

60 ప్లస్‌లోనూ కుర్రహీరోలను మించి సినిమాలు చేస్తున్నారు బాలయ్య. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు నట సింహం. ప్రజంట్ హిమాలయాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
బాలకృష్ణను సరికొత్తగా చూపించిన ఘనత అన్‌స్టాపబుల్ కార్యక్రమానిదే. తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమైన ఈ కార్యక్రమంలో బాలయ్య వ్యక్తిత్వం, నిజ జీవితంలో ఆయన ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో ద్వారానే ఆహా జనంలోకి బాగా వెళ్లడంతో పాటు సబ్‌స్క్రిప్షన్లు కూడా బాగా పెరిగాయి. స్టార్లు, సూపర్‌స్టార్లను బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానం.. 60 ప్లస్‌లోనూ ఆయన అల్లరి ఈ షోను ఎక్కడికో తీసుకెళ్లాయి.
అయితే పవన్ కళ్యాణ్‌తో జరిగిన ఎపిసోడ్ షూటింగ్ సమయంలో బాలకృష్ణ కాస్త ఇబ్బంది పడ్డారట. ఓ రోజున సీనియర్ హీరోయిన్ సుహాసినీ, డైరెక్టర్ జయంత్ సీ పరాన్జే, శ్రీయా శరణ్, హరీష్ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుహాసినీ ఓ క్వశ్చన్ అడుగుతారు. ఆహా షోలో మీ గెస్ట్‌లలో ఎవరైనా మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్లు మాట్లాడలేదు అని అనిపించిందా అని ప్రశ్నించారు. ఓ ఎపిసోడ్‌లో ఒకతను అలాగే చేశాడని.. అస్సలు మాట్లాడలేదని, ఎంతసేపు నేనే మాట్లాడటం, డల్‌గా ఉంటూ ముసిముసి నవ్వులు నవ్వేవాడని చెప్పారు.

కానీ ఓ అరగంట తర్వాత మాత్రం ఆ హీరో ఓపెన్ అయ్యాడని బాలయ్య తెలిపారు. ఒక్కసారి ఓపెన్ అయ్యాక మనతో మామూలుగా ఉండదు కదా అనడంతో అంతా నవ్వేస్తారు. అయితే ఆ స్టార్ ఎవరు అని హరీష్ శంకర్ ప్రశ్నించగా.. మీవాడే అని బాలయ్య చెప్పడంతో పవన్ కళ్యాణ్ అని అందరికీ అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్. సినీ, రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూసిన ఆ ఎపిసోడ్ 2023 ఫిబ్రవరి 2న స్ట్రీమింగ్ అయ్యింది. ప్రోమోకే బాక్స్‌లు బద్ధలు కాగా.. ఎపిసోడ్ ప్రసారమయ్యాక రికార్డులు బద్ధలయ్యాయి. 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను కేవలం 14 గంటల్లోనే రీచ్ అయ్యి .. వెండితెర అయినా, బుల్లితెర అయినా పవన్ క్రేజ్‌లో మార్పు ఉండదని ప్రూవ్ చేసింది.


Click it and Unblock the Notifications











