NBK Unstoppable: దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
నందమూరి బాలకృష్ణ మొదటి సారి ఒక ప్రత్యేకమైన టాక్ షో లతో హోస్ట్ గా మారబోతున్న విషయం తెలిసిందే. గత
కొంతకాలంగా సీనియర్ హీరోలు విభిన్నంగా బుల్లితెరపై రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ మాత్రం మొదటిసారిగా ఓటీటీ ప్రపంచంలో సరికొత్త గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన మొదట ఏదైనా వెబ్ సీరీస్ చేస్తారేమో అనుకుంటే అనుకుంటే ఎవరూ ఊహించని విధంగా ఆహా లో అన్‌స్టాపబుల్ టాక్ షో ద్వారా అలరించడానికి సిద్ధమయ్యారు. ఆ షోకు సంబంధించిన ఎపిసోడ్స్ కూడా కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక షో ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. అందుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

మొదటి సారి ఓటీటీలోకి
నందమూరి బాలకృష్ణ ఎక్కువగా వెండితెరపై అభిమానులు విజిల్స్ వేయించేలా విధంగా కనిపిస్తూ ఉంటారు. మాస్ యాక్షన్ సినిమాలను చేయడంలో ఆయన స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత వరకు తన అభిమానులకు నచ్చే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ హైలెట్ అయ్యేలా చూసుకుంటారు. అయితే మొదటి సారి బాలకృష్ణ ఓటీటీ యాప్ ద్వారా హోస్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దెబ్బకు థింకింగ్ మారిపోవాలా
ఇప్పటికే సమంత రానా దగ్గుబాటి వంటి వారితో ఆహా యాప్ టాక్ షోలతో మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు మాత్రం నందమూరి బాలకృష్ణ సరికొత్తగా ప్రజెంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల విడుదల చేసిన అన్‌స్టాపబుల్ పోస్టర్ లో అయితే నెవర్ బిఫోర్ అనేలా దర్శనమిచ్చాడు. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఈ షో నవంబర్ 4 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది సెలబ్రిటీలతో ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

పారితోషికం ఎంతంటే..
ఇక నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో కు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక ఎపిసోడ్ కు 40 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారట. బాలయ్య కోసం ఇప్పటికే మొత్తంగా 12 ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వాటికి టోటల్ గా ఐదు కోట్ల వరకు బాలయ్యకు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం.

నటరాజ్ మాస్టర్ కూడా..
ఆహా షో కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా నటరాజ్ మాస్టర్ కూడా ఒక హ్యాండ్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. షో మొదలయ్యే ముందు ఇంట్రడక్షన్ సాంగ్ తో బాలయ్య ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ పాటకు నటరాజ్ మాస్ కొరియోగ్రాఫీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రియాలిటీ షో కంటే ముందే బాలకృష్ణ ఇప్పటికే అఖండ అనే సినిమాను పూర్తి చేశాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Recommended Video

రాబోయే సినిమాలు..
తప్పకుండా అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేశాయి. అయితే అఖండ సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ కూడా ప్రస్తుతం అంచనాలను మరింత పెంచుతున్నాయి. అనంతరం బాలకృష్ణ గోపీచంద్ మలినేని అలాగే అనిల్ రావిపూడి దర్శకులతో కూడా వర్క్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అలాగే బీ.గోపాల్ వివి.వినాయక్ వంటి వారు కూడా బాలయ్య డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











