‘అఖండ’ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్: డేట్ ఫిక్స్ చేసేసిన నందమూరి బాలకృష్ణ
టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అఖండ'. సరైన హిట్ కోసం వేచి చూస్తున్న వీళ్లిద్దరూ ఈ సినిమా ద్వారా మూడో సారి కలిశారు. గతంలో వీళ్ల కలయికలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు రాబోతున్న చిత్రాన్ని వాటికి మించి ఉండేలా తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ఎన్నో ప్రయోగాలకు సైతం సిద్ధం అవుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్ రాబోతుందట.
'అఖండ' సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు, రెండు టీజర్లు విడుదలయ్యాయి. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇటీవల వచ్చిన టైటిల్ రోర్ వీడియో టాలీవుడ్‌లోని ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. దీంతో అంచనాలు కూడా రెట్టింపు అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ రెడీ అవుతోందట. అదే.. 'అఖండ'లోని ఫస్ట్ సింగిల్. అవును.. ఈ సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్‌ను నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయబోతున్నట్లు ఓ న్యూస్ లీకైంది.

నిజానికి అదే రోజు 'అఖండ' సినిమాను విడుదల చేయాలని నందమూరి బాలకృష్ణ అండ్ టీమ్ భావించింది. కానీ, కరోనా వల్ల షూటింగ్ వాయిదా పడడంతో అది సాధ్యం కాలేదు. ఇాలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ సింగిల్‌ను ఆరోజు వదలబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'అఖండ'ను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌తో పాటు పూర్ణ హీరోయిన్‌గా చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











