twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖండలో బాలయ్యతో ఫైట్ చేసిన బసవన్నలు ఎక్కడివో తెలుసా.. ఆ కోడెల ప్రత్యేకత ఏమిటంటే?

    |

    నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటోంది. విడుదలకు ముందే టీజర్ ట్రైలర్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన అఖండ విడుదల అనంతరం కూడా అదే తరహాలో ఆకట్టుకుంది. ఇక ఊహించినట్లుగానే మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లను అందుకొని బోయపాటికి కూడా సినిమా మంచి విజయాన్ని అందించింది. అయితే సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఎద్దులు ఎక్కడివి? వాటికి ఎలా ట్రైనింగ్ ఇచ్చారు అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

     హ్యాట్రిక్ సక్సెస్

    హ్యాట్రిక్ సక్సెస్

    సింహా, లెజెండ్ సినిమాలో అనంతరం ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది అనగానే అభిమానులలో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య జీవితం లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నట్లుగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంది. బాలకృష్ణ బోయపాటి కి ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి. మొత్తానికి లెజెండ్ అనంతరం హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.

    జై బాలయ్య అంటూ..

    జై బాలయ్య అంటూ..

    సినిమాలో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు అలాగే బాలకృష్ణ డైలాగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య ఫైట్ సీన్స్ కోసమే మరొకసారి సినిమాలు చూడాలి అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. థియేటర్స్ లో జై బాలయ్య నినాదాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కేవలం బి సి సెంటర్ల లోనే కాకుండా ఏ సెంటర్ లలో అలాగే ఓవర్సీస్ లో కూడా జై బాలయ్య అనే నినాదాలుతో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి.

    స్పెషల్ ఎట్రాక్షన్ గా కోడెలు

    స్పెషల్ ఎట్రాక్షన్ గా కోడెలు

    ఇక అఖండ సినిమాలో ప్రతి ఒక్క అంశం కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సినిమాలో కనిపించిన బసవన్నలు(కోడెలు)గా కనిపించిన గిత్తలకు సంబంధించిన సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలిచాయి. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

    అసలు పేర్లు ఏమిటంటే..

    అసలు పేర్లు ఏమిటంటే..

    ఆ కోడెలు చౌటుప్ప ల్‌ మండలం లక్కారం గ్రామానికి చెందినవట. నూనె శ్రీనివాస్‌ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో ఒక గోశాలను ఏర్పాటు చేసి. అందులో ప్రత్యేకమైన ఆవులు, కోడెలను పెంచుకుంటున్నాడు. ఇక రెండేళ్ల క్రితం కృష్ణుడు, అర్జునుడు అనే పేర్లతో ఉన్న కోడెలను కొనుగోలు చేశాడు. ఇక వాటికి వివిధ అంశాలపై శిక్షణ కూడా ఇచ్చాడు. ఎక్కడ ఉన్నా సరే పేరు పెట్టి పిలవగానే దగ్గరకు వచ్చేలా ట్రైనింగ్ ఇచ్చారట.

    ఎలా సెలెక్ట్ చేశారంటే..

    ఎలా సెలెక్ట్ చేశారంటే..

    అఖండ సినిమాలో బసవన్నలకు సంబంధించిన కోడెల కోసం చర్చలు రాగా.. అప్పుడే శ్రీనివాస్‌ గతేడాది రామోజీ ఫిలింసిటీకి పర్సనల్ వర్క్ మీద వచ్చాడు. షూటింగ్‌ జరుగుతుండడంతో ఎద్దుల చర్చ రాగా శ్రీనివాస్ తన కోడెలకు సంబంధించిన కొన్ని వీడియోలను ఫొటోలను డైరెక్టర్ బోయపాటికి చూపించాడు.మొదట వాటితో కొన్ని టెస్టింగ్ సీన్స్ ను షూట్ చేసి బాలయ్యకు చూపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

    రెండు రోజుల్లోనే..

    రెండు రోజుల్లోనే..

    ఇక గత ఏడాది చివరలో రామోజీ ఫిలింసిటీలో రెండు రోజుల పాటు పాటు కోడెలు షూటింగ్‌లో పాల్గొన్నాయి. సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్ లోనే కాకుండా క్లైమాక్స్‌ యాక్షన్ సీన్ లో కూడా అవి వారి బలాన్ని చూపించాయి. మూగజీవాలైనప్పటికీ సినిమా షూటింగ్‌లో దర్శకుడి ఆలోచనకు తగ్గట్టుగానే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. ఆ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు చాలా సంతోషించారు. ఇక వాటి యజమాని శ్రీనివాస్ కూడా అభిమాన హీరో బాలకృష్ణతో తన కోడెల కనిపించడం ఆనందంగా ఉందని వివరణ ఇచ్చారు.

    English summary
    Nandamuri Balakrishna akhanda movie basavanna bulls details and background..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X