‘అఖండ’ నుంచి అదిరిపోయే అప్‌డేట్: ఫ్యాన్స్‌కు ఏం కావాలో అదే వదలబోతున్నారట
కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం గతంలో తనకు 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ సక్సెస్‌లను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇప్పుడు వస్తున్న చిత్రమే 'అఖండ'. పవర్‌ఫుల్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.
నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు హిట్ ఎంతో అవసరం. అందుకే 'అఖండ' మూవీపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే ప్రతీ దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఓ సర్‌ప్రైజ్ రాబోతుందట. తాజా సమాచారం ప్రకారం.. 'అఖండ' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయబోతున్నారట. అది కూడా అలా ఇలా ఉండదని తెలుస్తోంది. చాలా కాలంగా ఆకలి మీదున్న ఫ్యాన్స్ కోసం ఈ చిత్రం నుంచి పక్కా మాస్ బీట్‌ను రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కంపోజింగ్ కూడా పూర్తైందని టాక్. దీనికి థమన్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడని కూడా తెలుస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ'లో నందమూరి బాలకృష్ణ అఘోరాగా, పవర్‌ఫుల్ రైతుగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక, ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌తో పాటు పూర్ణ హీరోయిన్‌గా చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











