Akhanda మూవీ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్: ప్రత్యేకమైన రోజు నుంచే మొదలెడతారట
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. అప్పటి నుంచి ఫలితాలను పట్టించుకోకుండా ఆయన వరుస పెట్టి సినిమా మీద సినిమాలు చేస్తున్నా విజయం మాత్రం వరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కి పునర్వైభవాన్ని అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ మూడోసారి జత కట్టారు.
'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'అఖండ'. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ భాగం మాత్రం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే షూట్‌ను పున: ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో క్లైమాక్స్ ఎపిసోడ్‌ను చిత్రీకరించి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. అందుకోసం హైదరాబాద్‌లోని ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలో కొన్ని సెట్లను కూడా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'అఖండ' నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

ఇప్పటికే 'అఖండ' సినిమా నుంచి రెండు టీజర్లు విడుదలయ్యాయి. ఈ రెండింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా గత ఉగాదికి విడుదలైన టైటిల్ రోర్ వీడియో అయితే ఏకంగా యాభై మిలియన్లకు పైగా వ్యూస్‌ను అందుకుంది. తద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు సౌతిండియా రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. వీటి తర్వాత ఇప్పుడు ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 'అఖండ' మూవీ ఫస్ట్ సింగిల్ స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'అఖండ' మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే టీజర్లలో అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అతడు.. ఆల్బమ్‌పై అంచనాలను పెంచేశాడు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలోని పాటలు అన్నింటినీ సూపర్బ్‌గా కంపోజ్ చేశాడట. అందులో నుంచి టైటిల్ సాంగ్ కానీ, ఓ మాస్ బీట్ కానీ ఆగస్టు 15న విడుదల కాబోతుందని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో నందమూరి అభిమానులు ఈ పాట కోసం ఇప్పటి నుంచే వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ'లో నందమూరి బాలకృష్ణ అఘోరాగా, పవర్‌ఫుల్ రైతుగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తైందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దీన్ని దసరాకు విడుదల చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











