Balakrishna - గోపీచంద్ మూవీ ప్రకటన.. వేట అప్పటి నుంచే మొదలు

ఈ మధ్య కాలంలో హిట్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో 'అఖండ' అనే సినిమాను చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ మరికొంత భాగం బ్యాలెన్స్ ఉంది. ఇక, ఇది పూర్తవక ముందే యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరో సినిమాను చేయబోతున్నారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.

ఈరోజు (జూన్ 10) నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. దీనినిపురస్కరించుకుని ఆయన నటించబోతయే 107వ సినిమాను అనౌన్స్ చేశారు. 'క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ముందుగా ప్రకటించినట్లుగా ఈరోజు ఉదయం 8.45 గంటలకు ఈ సినిమా ప్రకటన వెలువడింది. అంతేకాదు, త్వరలోనే వేట మొదలవబోతుందని అందులో వెల్లడించారు.

Nandamuri Balakrishna and Gopichand Malineni Movie Announced

ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కోసం ఓ వీడియోను సైతం విడుదల చేశారు. అందులో సింహాన్ని హైలైట్ చేసి చూపించారు. దీనికి థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. దీంతో అప్పుడే దీనిపై అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నిజ జీవితం సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఇందుకోసం గోపీచంద్ మలినేని పల్నాడు ప్రాంతానికి సంబంధించిన గ్రంథాలయాల్లో వంద ఏళ్ల నాటి పేపర్లను తిరగేశాడు. ఇక, ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో వస్తుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇందులో బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్‌గా.. ఫ్యాక్షనిస్టుగా నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X