వేట మొదలెట్టబోతున్న బాలకృష్ణ: ముహూర్తం ఫిక్స్ చేసిన యంగ్ డైరెక్టర్
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ, అవేమీ ఈ సీనియర్ హీరోకు సక్సెస్‌ను అందించలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో బాలయ్య.. బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమాను చేస్తున్నారు.
'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. దీని తర్వాత నటసింహా.. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ ప్రాజెక్టును చేయబోతున్నారు. వాస్తవానికి దీన్ని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా 'అఖండ' షూట్ ఆలస్యం కావడంతో.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.

ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు గోపీచంద్ మలినేని. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే నందమూరి బాలకృష్ణకు కథ చెప్పగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 నుంచి పట్టాలెక్కించబోతున్నారట. ఈ మేరకు చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ఏర్పాట్లను కూడా చేస్తోందని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందుకోసం ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలో ఓ సెట్‌ను కూడా నిర్మించాలని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
నందమూరి బాలకృష్ణ 107వ సినిమాగా రాబోతున్న దీన్ని ముందుగా యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రారంభించబోతున్నట్లు కూడా ఓ వార్త తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే యాక్షన్ పార్ట్‌కు సంబంధించిన ఎపిసోడ్స్‌ను ఫైట్ మాస్టర్లతో కలిసి డిజైన్ చేయించేశాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఎంతో పవర్‌ఫుల్‌గా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి.

ఈ సినిమా కోసం నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథను రెడీ చేశాడీ యంగ్ డైరెక్టర్. పల్నాడు నేపథ్యంతో సాగే ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుందట. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడని ఈ మధ్యనే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అలాగే, వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రను చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











