అభిమానికి నందమూరి బాలకృష్ణ వార్నింగ్.. వాడిని రానివ్వకండి అంటూ తీవ్ర ఆగ్రహం
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2: తాండవం చిత్రం డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు రెడీ అవుతున్నది. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖపట్నంలో మాస్ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విశాఖకు చేరుకొన్న బాలయ్య తన అభిమానిపై తీవ్ర ఆగ్రహం చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియో వెనుక వార్త వివరాల్లోకి వెళితే..

అఖండ 2 చిత్రంలోని జాజికాయ జాజికాయ అనే పాటను విశాఖపట్నంలో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ బోయపాటితో కలిసి బాలయ్య వైజాగ్ చేరుకొన్నారు. విమానాశ్రయంలో ఆయనకు భారీగా అభిమానులు స్వాగతం పలికారు. తన ఫ్యాన్స్‌ను చూసిన బాలయ్య ఓ దశలో మురిసిపోయాడు. అయితే ఉన్నట్టుండి ఓ అభిమానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓ అభిమానిని చూపిస్తూ వెళ్లు ఇక్కడి నుంచి.. వీడు ఎందుకు వచ్చాడు అంటూ గట్టిగా అరిచాడు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
ఆ తర్వాత తనను కలువడానికి వచ్చిన మహిళలతో ఆనందంగా మాట్లాడుతూ వారితో కలిసి బాలయ్య ఫోటోలు దిగారు. లేడీస్ కోరిక మేరకు సెల్ఫీలు కూడా దిగారు. ఆ తర్వాత కారు ఎక్కబోతుండగా.. మళ్లీ అభిమాని కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీడిని పంపించేయండి. వీడు ఎందుకు వచ్చాడు. వాడిని సాయంత్రం కూడా రానివ్వకండి. వాడిని అంటూ అభిమాని వైపు వేలెత్తి చూపించాడు. అయితే తన ఆగ్రహానికి కారణం ఏమిటి? సాధారణంగా అభిమానులతో ఫ్రెండ్లీగా ఉండే ఆయన కోపంతో ఎందుకు ఊగిపోయారనేది తెలియాల్సి ఉంది. బాలయ్యతో అభిమాని ఏదైనా తప్పుగా ప్రవర్తించాడా? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











