క్షమాపణలు చెప్పిన నందమూరి బాలకృష్ణ.. వివాదానికి తెర వేసిన నటసింహం
దేవబ్రహ్మణ కులానికి రావణబ్రహ్మ నాయకుడు అంటూ సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మీడియాలో దుమారం లేపాయి. దేవబ్రహ్మణుల తమ కులానికి నాయకుడు రావణ బ్రహ్మ కాదంంటూ మండిపడ్డారు. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నందమూరి బాలకృష్ణ వెంటనే స్పందించారు. మీడియా ద్వారా క్షమాపణలు చెబుతూ ప్రత్యేకంగా ఓ ప్రకటనను జారీ చేశారు. ఈ వివాదంపై నందమూరి బాలకృష్ణ వివరణ ఇస్తూ..
దేవబ్రహ్మణ సోదరిసోదరీమణులుకు మీ సోదరుడు నందమూరి బాలకృష్ణ మన:పూర్వక మనవి. దేవబ్రహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పుని నాకు తెలియజెప్పిన దేవబ్రహ్మణ పెద్దలందరికీ పేరుపేరును ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డాను. నాకు ఎవరినీ బాధపెట్టాలన్న ఆలోచన లేదు. ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు. దురదృష్టవశాత్తూ అ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే అని బాలకృష్ణ అన్నారు.

అంతేకానీ సాటిసోదరుల మనసు గాయపరచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏముంటది చెప్పండి. పైగా దేవాంగులలో చాలా మంది నా అభిమానులు ఉన్నారు. నా వాళ్లను నేను బాధపెట్టుకొంటానా? నా వివరణను అర్థం చేసుకొంటారని, నా పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ తన ప్రకటనలో తెలిపారు.
ఇదిలా ఉండగా, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం జనవరి 11న సంక్రాంతి పండుగ కానుకగా రిలీజై భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం 75 కోట్లకు చేరువైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తున్నది.


Click it and Unblock the Notifications











