ఎన్టీఆర్ బయోపిక్: వెంకటేశ్వరస్వామిగా బాలయ్య న్యూ పోస్టర్
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్ విడుదలైంది. లార్డ్ వెంకటేశ్వరస్వామి పాత్రలో బాలకష్ణ దర్శనమిచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా బాలయ్య లుక్ అదిరిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా ఈ బయోపిక్ రూపొందుతుండగా మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండో భాగం 'ఎన్.టి.ఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. ఎన్‌బికె ఫిల్మ్స్ నిర్మాణంలో వారాహి చలన చిత్రం సమర్పణలో ఈ బయోపిక్ విడుదల కాబోతోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.
ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ 'యూ' సర్టిఫికెట్ జారీ చేశారు. దీనితో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్లు అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.


Click it and Unblock the Notifications











