బాలయ్య అభిమానులకు శుభవార్త: ఒకేసారి రెండు పండుగలు జరుపుకునేలా ప్లాన్

కొంత కాలంగా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడాయన. ఇందుకోసం గతంలో తనకు 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాలను అందించిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిశాడు. గతంలో వచ్చిన చిత్రాలను మించి దీన్ని రూపొందిస్తున్నారు. BB3 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఎన్నో సర్‌ప్రైజ్‌లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ లీకైంది.

BB3 టైటిల్‌ను ఉగాది పండుగను పురస్కరించుకుని ఆరోజు విడుదల చేస్తారని చాలా రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని అఘోరా లుక్‌ను కూడా ఆరోజే రివీల్ చేయబోతున్నారట. విడుదల చేసేది ఒకే పోస్టర్ అని.. అందులోనే టైటిల్‌తో పాటు ఊహించని గెటప్‌తో ఉన్న బాలకృష్ణ దర్శనం ఇస్తాడనే న్యూస్ ఒకటి ఫిలిం నగర్ ఏరియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అంటే నందమూరి అభిమానులకు ఒకే రోజు రెండు పండుగలు రాబోతున్నాయన్న మాట. ఇక, ఈ మూవీకి 'గాడ్ ఫాదర్' టైటిల్‌నే ఫిక్స్ చేశారని సమాచారం.

 Nandamuri Balakrishna BB3 Look and Title Revealed in Ugadi

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X