బాలకృష్ణ అభిమానులకు BB3 యూనిట్ గుడ్ న్యూస్: టైటిల్ రోర్‌ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేశారు

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయిక ఒకటి. దీనికి కారణం వీళ్లిద్దరి కాంబోలో గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాలు రావడమే. వాటి తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. కానీ, అది సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది బాలయ్య - బోయపాటి కలిసి ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్‌పై తాజాగా ఓ అప్‌డేట్ వచ్చేసింది.

బాలయ్య.. బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి BB3 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ క్రమంలోనే దీనికి పలానా టైటిల్ పెడుతున్నట్లు ఎప్పటి నుంచో ఊహాగానాలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 13న మధ్యాహ్నం 12.33 గంటలకు 'టైటిల్ రోర్' రాబోతున్నట్లు చిత్ర యూనిట్ కాసేపటి క్రితం అధికారికంగా వెల్లడించింది. అయితే, అది పోస్టర్ మాత్రమేనా లేక వీడియో రూపంలో ఉంటుందా అన్న దానిపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఈ అప్‌డేట్‌తో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 Nandamuri Balakrishna BB3 Title Roar at April 13th

ఇక, ఈ సినిమాకు 'గాడ్ ఫాదర్' అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారని తెలుస్తోంది. దీనినే ఉగాది రోజు రివీల్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X