బాలయ్య బాబు ఫ్యాన్స్ రెడీయేనా.. సమరసింహారెడ్డి సంచలనం చేయబోయేది ఈరోజే!

నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు చెబితే చాలు తెలుగు సినీ ప్రేక్షకులు అంతా తెగ ఎగ్జైట్ అవుతుంటారు. మా బాలయ్య బాబు మా బాలయ్య బాబు అంటూ జబ్బలు చరుచుకుంటారు. 62 ఏళ్ల వయసులోనూ బాలకృష్ణకు ఉన్న క్రేజ్ చూస్తే షాక్ అయిపోతారు. ఇప్పటికీ మాస్ చిత్రాల్లో నటిస్తూ విపరీతమైన ఫైటింగ్స్ చేస్తూ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు. అయితే పాతికేళ్ల క్రితం ఈయన హీరోగా చేసిన ఓ సూపర్ డూపర్ హిట్ సినిమాను ఈరోజే రీరిలీజ్ చేయబోతున్నారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ సూపర్ డూపర్ హిట్టు సినిమానే సమరసింహారెడ్డి. 1999లో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. టీవీలో వస్తే కచ్చితంగా చూసే వాళ్లలో చాలా మంది ఉన్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సిమ్రాన్, అంజలా జవేరియాలు నటించగా.. జయ ప్రకాశ్ రెడ్డి, పృథ్వీరాజ్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, దేవరాజ్, సుమిత్ర వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు.

Nandamuri Balakrishna Block Buster Hit Movie Samara Simhareddy Rerelease Today Check Details

శ్రీసత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చెంగల వెంకట రావు నిర్మించిన ఈ సినిమాకు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. 1990 జనవరి 13వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈక్రంమలోనే ఈ సినిమాను రీరిలీజ్ చేసి బాలయ్య బాబు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలనుకున్నారు చిత్రంబృందం. అందుకోసమే ఈ సినిమా ప్రింట్ క్లారిటీని కూడా పెంచి థియేటర్లలోరి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 4కే అల్ట్రా హెచ్డీతో ఈ సినిమా ప్రింట్ ను మార్చారు.

ప్రస్తుతం సూపర్ క్వాలిటీతో థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే ముందు నుంచి అనుకున్నట్లుగానే మార్చి 2వ తేదీ అంటే ఈరోజే ఈ సినినమాను థియేటర్లలోకి తీసుకు రాబోతున్నారు. 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తుండగా.. బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. సినిమా చూడాలి అనుకున్న వాళ్లు బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకుని బాలయ్య బాబు సూపర్ హిట్ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు.

Nandamuri Balakrishna Block Buster Hit Movie Samara Simhareddy Rerelease Today Check Details

ఈ సినిమాలో బాలయ్య బాబు చేసిన యాక్టింగ్, ఫైట్ లతో పాటు పాటలు మరింత అద్బుతంగా ఉంటాయి. అలాగే ఆయన స్పెషల్ స్టెప్పులు కూడా ఇప్పటికీ మర్చిపోలేము. ముఖ్యంగా ఈ సినిమాలోని అందాల ఆడబొమ్మ, చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు, అడ్డీస్ అబ్బబ్బా అల్లం మురబ్బా, రావయ్యా ముద్దుల మావా, నందమూరి, లేడీ లేడీ... వంటి స్పెషల్ సాంగ్స్ ను మరింత స్పెషల్ ప్రింట్ తో చూసి ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X