బాలకృష్ణ సినిమా నుంచి ఊహించని అప్‌డేట్: భారీగా తగ్గిపోవడంతో మొదలైన అనుమానాలు.!

By Manoj

పేరుకు సీనియర్ హీరోనే అయినా అన్నింటిలోనూ కుర్రాళ్లతో పోటీ పడుతున్నారు నందమూరి హీరో బాలక‌ృష్ణ. క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచే ఆయన.. సినిమాకు సంబంధించిన వ్యవహారాలన్నీ టైమ్ టూ టైమ్ చేస్తుంటారు. అలాగే, సినిమాల కోసం ఎంతో కష్టపడుతుంటారు. మరీ ముఖ్యంగా సినిమా సినిమాకూ అస్సలు గ్యాప్ ఇవ్వని బాలయ్య.. బోయపాటితో చేయాల్సిన సినిమాను మాత్రం ఇంకా పట్టాలెక్కించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించిన ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం.!

 వరుస దెబ్బలతో బాలయ్యకు ఇబ్బందులు

వరుస దెబ్బలతో బాలయ్యకు ఇబ్బందులు

నందమూరి బాలకృష్ణకు 2019వ సంవత్సరం అస్సలు కలిసి రాలేదు. ఆ ఏడాది ఆయనకు వరుస దెబ్బలు తగిలాయి. సంవత్సరం ఆరంభంలో ఆయన ‘యన్.టి.ఆర్' బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు భాగాలుగా విడుదలైన దానికి దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే, డిసెంబర్‌లో విడుదలైన ‘రూలర్' కూడా నిరాశనే మిగిల్చింది.

క్లిష్ట సమయంలో ఆయనతో మరోసారి జోడీ

క్లిష్ట సమయంలో ఆయనతో మరోసారి జోడీ

వరుస పరాజయాలతో సతమతం అవుతున్న సమయంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో బాలయ్య మరోసారి కలిశారు. వీళ్ల కాంబోలో మూడో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే, అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు.

హాట్ టాపిక్ అవుతోన్న బాలయ్య లుక్

హాట్ టాపిక్ అవుతోన్న బాలయ్య లుక్

ఈ సినిమాలో నందమూరి హీరో డిఫరెంట్ లుక్‌లతో కనిపించబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులోనూ ఒకటి వారణాశి ప్రాంతంలో ఉండే అఘోరా లుక్‌ అని అంటున్నారు. దీనితో పాటు స్టైలిష్ బిజినెస్‌మ్యాన్ పాత్ర మరొకటి అని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో బాలయ్య రైతుగా కూడా కనిపించనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఆ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు

ఆ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో నటించబోయే హీరోయిన్ విషయంలో పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. ఇటీవల ఇందులో కొత్త హీరోయిన్లను ట్రై చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, క్లారిటీ మాత్రం రావడం లేదు.

 బాలకృష్ణ సినిమా నుంచి ఊహించని అప్‌డేట్

బాలకృష్ణ సినిమా నుంచి ఊహించని అప్‌డేట్

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకే ఈ మూవీని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం... ఈ సినిమాకు మొదట అనుకున్న బడ్జెట్‌ రూ. 70 కోట్లు కాగా, ఇప్పుడది రూ. 50 కోట్లకు తగ్గిందట.

భారీగా తగ్గిపోవడంతో మొదలైన అనుమానాలు.!

భారీగా తగ్గిపోవడంతో మొదలైన అనుమానాలు.!

వరుస ఫ్లాపులతో బాధ పడుతున్న బాలయ్య సినిమాకు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి రూ. 70 కోట్లు పెట్టుబడి పెడుతున్నారనే వార్త అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఆ బడ్జెట్ కాస్తా భారీగా తగ్గడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ... బాలయ్య మూవీ మరోసారి చర్చనీయాంశం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X