twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరూ అలసత్వం ప్రదర్శించవద్దు: బాలయ్య

    |

    'మనకు 5 సంవత్సరాలకు ఒకసారి నాయకుడిని ఎన్నుకునే అవకాశం వస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన హక్కు. మన చేతిలో ఆయుధం' అన్నారు సినీ నటుడు బాలకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన గురువారం ఓటు వేశారు.

    ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు సద్వినియోగ పరుచుకోవాలి, ఎవరూ అలసత్వం చేయకుండా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని బాలయ్య సూచించారు. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్... పోలింగ్ తేదీని సెలవు దినంగా భావించి ఇంట్లో కూర్చోకుండా వచ్చి ఓటు వేయాలని కోరారు బాలయ్య.

    Nandamuri Balakrishna Casts His Vote Along With His Wife

    ఏ ప్రభుత్వం వస్తే మీ అవసరాలు తీరుతాయో, అభివృద్ధి జరుగుతుందో, మీకు మంచి సంక్షేమ పథకాలు అమలు అవుతాయో, మీ భవిష్యత్ బావుంటుందని భావిస్తారో వారికి ఓటు వేయండి అని ఈ సందర్భంగా బాలకృష్ణ స్పష్టం చేశారు.

    గత ఐదేళ్లుగా నేను హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచే ఓటు వేయడం... సొంత ఊర్లో ఓటు వేస్తున్నంత ఆనందంగా ఉందని బాలయ్య తెలిపారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య వసుంధరదేవి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    English summary
    Nandamuri Balakrishna Casts His Vote Along With His Wife at Hindupur. Nandamuri Balakrishna, also known as NBK and Balayyababu or simply Balakrishna, is an Indian film actor and politician known for his works predominantly in the Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X