నాకు పొగరే.. రెండేళ్ల కింద చెప్పా ఇప్పుడు చేశా.. ఇక తాండవమే

టాలీవుడ్ సీనియర్ నటుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ కొంత కాలంగా వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుంటున్నారు. అయితే గతంలోనే తను చేయబోయే చిత్రాలపై ఛాలెంజ్ చేశారు. రెండేళ్ల కింద ఛాలెంజ్ చేయడంతో చాలా మంది నెగెటివ్ గా మాట్లాడారని, తాజాగా గతంలో వచ్చిన విమర్శలను తాజాగా చెప్పుకొచ్చారు. తనను చాలా మంది ఏమనుకున్నారో చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.

బాలకృష్ణ వరుస బ్లాక్ బాస్టర్స్..
నందమూరి బాలకృష్ణ కొంత కాలంగా వరుసగా బ్లాక్ బాస్టర్స్ అందుకుంటున్నారు. కరోనాకు ముందు థియేటర్లలోకి వచ్చిన చిత్రాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేదు. సింహ లాంటి చిత్రాలతో మాత్రం అప్పుడప్పుడు దుమ్ములేపాడు. ఇక కరోనా తర్వాత నుంచి నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతి చిత్రం బ్లాక్ బాస్టర్ అవుతుండటం విశేషం. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అఖండ' చిత్రం తర్వాత నుంచి బాలకృష్ణ వరుసగా విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. తెలుగు మార్కెట్ లోనూ బాలయ్య సినిమాలకు భారీ డిమాండ్ పెరిగింది. వరుస విజయాలతో బాలకృష్ణ చిత్రాలకు మరింత డిమాండ్ ఉండటం విశేషం.

Nandamuri Balakrishna Challenge 2 Years ago and Acheaved it

ఘనంగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు..
నందమూరి బాలకృష్ణ ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతారనే విషయం తెలిసిందే. మనస్సులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు. కాగా జూన్ 10న నందమూరి బాలకృష్ణ 65వ పుట్టిన రోజు వేడుకలను హిందూపురంలో ఘనంగా నిర్వహించారు. ఘన సన్మానం కూడా చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన అభిమానులకు, హిందూపురం ప్రజలకు ప్రత్యేకం ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిస్తున్న ప్రేమకు సంతోషించారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న అటు పోటులు, ఎదుర్కొన్న సవాళ్లను తన అభిమానులకు తెలియజేసే ప్రయత్నం చేశారు.

నాకు పొగరు అన్నరు.. ఛాలెంజ్ చేశా..
గతంలో తనను చాలా మంది ట్రోల్ చేశారని, తన విసిరిన సవాళ్లకు పొగరని అన్నారని బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకల్లో చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తన సినిమాల విషయంలో చాలా మంది ట్రోల్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రెండేళ్ల కింద ఒక ఛాలెంజ్ చేశాను. ఇకపై నా సినిమాలు వేరే లెవల్లో ఉంటాయని అన్నాను. కానీ అప్పుడు చాలా మంది నా మాటలకు పొగరని అన్నారు. అవును నాకు పొగరే. చెప్పింది చేయడంలో నాకు పొగరే ఉంటుంది. సవాల్ చేయడమే కాదు చేసి చూపాను. అఖండ, డాకూ మహారాజ్ సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఇక నెక్ట్స్ అఖండ 2తో తాండమే' అని చెప్పుకొచ్చారు.

బాలయ్య నెక్ట్స్ మూవీస్..
అఖండ 2 చిత్రం 2025 సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత మార్కో దర్శకుడితో బాలయ్య పని చేయాలని ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే బాలకృష్ణ కోలీవుడ్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇక మున్ముందు ఎలాంటి ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఆరుపదుల వయస్సులోనూ మాస్ ఆడియెన్స్ కు అసలైనా చిత్రాలను అందిస్తూ ఆకట్టుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X