కాజల్ కోసం రంగంలోకి బాలయ్య.. మాస్ కాంబో నుంచి బిగ్ సర్‌ప్రైజ్

టాలీవుడ్‌లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చినా.. కొందరు హీరోయిన్లు మాత్రం తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి ఎదిగి స్టార్లుగా మారిపోయారు. అలాంటి వారిలో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేసిన ఈ అమ్మడు.. ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టింది. అప్పటి నుంచి మళ్లీ వరుస చిత్రాలతో సందడి చేస్తోంది.

కాజల్ అగర్వాల్ గత ఏడాది 'భగవంత్ కేసరి' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె మరింత జోష్‌తో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కాజల్ అగర్వాల్ 'సత్యభామ' అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే దీని నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్ వచ్చాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి.

Nandamuri Balakrishna Chief Guest For Satyabhama Movie Trailer Event

యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న 'సత్యభామ' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఈ మూవీ షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చారు. అదే సమయంలో అప్పుడప్పుడూ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లను కూడా చిత్ర యూనిట్ ఇచ్చింది. ఇలా ఈ చిత్రాన్ని మే 31వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సత్యభామ' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే మే 24వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఉన్న ఐటీసీ కొహెనూర్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.

Nandamuri Balakrishna Chief Guest For Satyabhama Movie Trailer Event

క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో రూపొందిన 'సత్యభామ' మూవీ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. అంతేకాదు, 'క్వీన్ ఆఫ్ మాసెస్ కోసం గాడ్ ఆఫ్ మాసెస్' రంగంలోకి దిగుతున్నట్లు తెలిపింది. దీంతో ఈ ఈవెంట్ కోసం నందమూరి ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. 'సత్యభామ' మూవీని సుమన్ చిక్కల తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క నిర్మిస్తున్నారు. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X