వైఎస్ జగన్ సీఎం కావడం ఏపీ దౌర్బాగ్యం.. చంద్రబాబు అరెస్ట్‌పై బాలకృష్ణ ఆగ్రహం
తెలుగు దేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై చంద్రబాబును నంద్యాలలో అర్ధరాత్రి అదుపులోకి తీసుకొన్నారు. చంద్రబాబు అరెస్ట్ ఘటన ఏపీని కుదిపేసింది. చంద్రబాబు అరెస్ట్‌పై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ..
ప్రజా సంక్షేమాన్నా గాలికి వదిలేసి.. ప్రతీపక్ష నేతలపై కక్ష పూరితంగా వ్యవరిస్తున్నాడు. వైఎస్ జగన్ లాంటి వ్యక్తి సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యం అని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబును కనీసం 16 నిమిషాలైనా జైలులో ఉంచాలని జగన్ కుట్ర పన్నాడు అని బాలయ్య అన్నాడు.

స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు ఉన్నాయని.. చంద్రబాబును అరెస్ట్ చేశారు అని నందమూరి బాలకృష్ణ ప్రశ్నించాడు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణమని ప్రచారం తప్ప అందులో వాస్తవం లేదు. ఒకవేళ కుంభకోణం జరిగితే.. ఇంత వరకు ఎందుకు చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు బాలకృష్ణ ప్రశ్నించాడు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించారు. జగన్ సీఎం అయిన తర్వాత అన్నం తినడం మానేశాడు. కోర్టుతో చివాట్లు తినడమే అలవాటు అయింది. తప్పు మీద తప్పు చూస్తూ.. కోర్టుతో చివాట్లు తింటున్నారు. ఇలాంటి అక్రమ కేసుల గురించి భయపడే పరిస్థితి లేదు అని బాలయ్య ఘాటుగా స్పందించారు. ఈ కేసులో న్యాయపోరాటం చేస్తాం. ప్రజా కోర్టులో తెల్చుకొంటాం అని బాలయ్య చెప్పారు.
ఇదిలా ఉండగా, చంద్రబాబు అరెస్ట్‌పై ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ స్పందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన ముద్దాయి. ఈ వ్యవహారంలో 550 కోట్ల కుంభకోణం జరిగింది. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 371 కోట్లు డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీలకు మళ్లాయని సంజయ్ తెలిపారు. ఈ కేసులో చంద్రబాబును కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో లోకేష్‌ను కూడా విచారిస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications











