Nandamuri Balakrishna: సినిమాల్లోకి మోక్ష ఎంట్రీ.. నటసింహం ప్లాన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకుగా.. తన అద్భుతమైన టాలెంట్ తో అనేక చిత్రాల్లో నటిస్తూ కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన హీరోగా చేసిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. శ్రీలీల కూతురుగా కనిపించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీ రోజు రిలీజ్ అయింది. హిట్టు టాక్ తో దూసుకెళ్తోంది. వసూళ్ల వేట కొనసాగిస్తూ రచ్చ చేస్తోంది.
ఈక్రమంలోనే నందమూరి బాలకృష్ణ, శ్రీలీలలు దసరా సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ గురించి కొన్ని అదిరిపోయే కామెంట్లు చేశారు. ఆయన సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలిపారు. అందుకోసం స్పెషల్ గా ఆయనే కథలు కూడా రెడీ చేసినట్లు స్పష్టం చేశారు. అయితే మోక్ష తీయబోయే మొదటి సినిమా ఎవరితోనే తెలియదని.. మెంటల్ గా తాను ముందే ఏదీ ప్రిపేర్ కానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అప్పటికప్పుడు డిసీషన్ తీసుకుంటానన్నారు. అలాగే రేపు షూటింగ్ ఉంటే ఈరోజు రాత్రి కథ అనుకుంటానని వివరించారు.

అసలు కుమారుడు మోక్ష ఫ్యూచర్ గురించి తనకు ఎలాంటి టెన్షన్ లేదని బాలకృష్ణ వెల్లడించాడు. ప్రస్తుతం తానే కెరియర్ పరంగా ఏమాత్రం ఖాళీగా లేనని వివరించారు. ఫుల్ బిజీగా ఉన్నట్లు చెబుతూనే.. మోక్షజ్ఞ ఒకటో సినిమా కానీ, రెండో సినిమా కానీ ఆదిత్య 999 అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. అదంతా తన సబ్జెక్టే అని.. ఒక రాత్రిలోనే దాన్ని పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే ఇంకో కథ కూడా కొడుకు మోక్షజ్ఞ కోసం రెడీ చేసి పెట్టుకున్నాడట. అయితే ఈ అద్భుతమైన రెండు కథలు.. ఎవరికి డైరెక్ట్ చేసే అవకాశం దక్కుతుందో చూడాలంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
కథలు, హిట్ల గురించి.. ముఖ్యంగా కొడుకు మొదటి సినిమా గురించి ఏమాత్రం దిగులు లేదని బాలకృష్ణ చాలా క్లియర్ గా చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ మనవడు అనో, బాలకృష్ణ కొడుకు అనే ఎవరూ సినిమా చూడరని.. సబ్జెక్టు నచ్చితే కచ్చితంగా హిట్టు అవుతుందని అన్నారు. ఇప్పటికే కథలు రెడీ చేసి పెట్టాడు కాబట్టి ఈ ఏడాదో, వచ్చే ఏడాదో మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి బాబు ఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారో.

మరోవైపు బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రం.. మూడ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.29.48 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా రూ.71 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణలో మూడు రోజుల్లో రూ.23.08 కోట్లు రాబట్టిన ఈ భగవంత్ కేసరి చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటుకుంది. కర్ణాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.1.55 కోట్లు, ఓవర్సీస్ లో రూ.4.85 కోట్లు వసూలు చేసింది. మరో వారం రోజుల పాటు అలాగే సినిమా దూసుకెళ్తే.. 50 కోట్లు దాటే అకాశం ఉంది.


Click it and Unblock the Notifications











