రికార్డు రూపంలో ప్రేమ, అభిమానాలు.. ప్రపంచ రికార్డుపై బాలకృష్ణ, ఫ్యాన్స్‌కు కంగ్రాట్స్
ఏ ఫ్యాన్స్‌కైనా తన అభిమాన నటుడు పుట్టిన రోజు అంటే తన బర్త్ డే రోజుకంటే ఎక్కువ సంతోషాన్ని పడుతుంటారు. అదే విషయాన్ని నందమూరి బాలకృష్ణ అభిమానులు నిరూపించారు. జూన్ 10న బాలకృష్ణ తన 60వ పుట్టిన రోజున నిరాడంబరంగా జరుపుకొన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా అట్టహాసంగా పుట్టిన రోజును జరుపుకోవద్దని అభిమానులను బాలయ్య కోరారు. కరోనా కారణంగా బాలయ్య తన అభిమానుల ఉత్సాహానికి కొంత అడ్డుకట్ట వేశారేమో కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ప్రపంచ రికార్డు సృష్టించే రేంజ్‌లో బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. ఈ రికార్డు గురించి బాలకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డులకు సంబంధించి అభిమానులు ఉత్సాహాన్ని బాలకృష్ణ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనలో.. నా బర్త్ డేను అభిమానులు, శ్రేయోభిలాషులు చాలా జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకొన్నారు. కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషం కలిగించింది. ఇది వారి సామాజిక బాధ్యతను సూచించింది. ప్రపంచ రికార్డు రూపంలో నా ప్రేమను, అభిమానాన్ని బహుమతిగా అందించారు. సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తూ ఈ రికార్డును సాధించడంలో భాగమైన ప్రతీ అభిమానికి నా అభినందనలు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన అనంతపూర్ జగన్‌కు కంగ్రాట్స్ అని బాలయ్య తన ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతపురంకు చెందిన ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి జగన్ పర్యవేక్షణలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జూన్ 10వ తేదీన 10 గంటల 10 నిమిషాలకు ఏకకాలంలో సుమారు 21వ వేల కేకులను కట్ చేసి బాలయ్యపై తమ అభిమానాన్ని చాటుకొన్నారు. ఈ రేంజ్‌లో కేక్ కట్ చేయడం రికార్డు అని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. ఈ రికార్డుకు సంబంధించిన ప్రశంసా పత్రాలను త్వరలోనే అందజేస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా, బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా ఈ షూటింగ్ వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











