కరోనాకు భయపడని బాలకృష్ణ: అస్సలు ఆగేదే లేదంటూ ఫైట్ చేస్తున్నాడట

జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఆయన చేసిన చిత్రాలన్నీ నిరాశనే మిగిల్చాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్‌లోనే మాస్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న బోయపాటి శ్రీనుతో ప్రస్తుతం 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఆయన కరోనా వైరస్‌ను కూడా లెక్కచేయడం లేదని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫలితంగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సినిమాల షూటింగులు నిలిచిపోతున్నాయి. అయితే, నందమూరి బాలకృష్ణ మాత్రం వికారాబాద్ అటవీ ప్రాంతంలో జరుగుతోన్న 'అఖండ' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అక్కడ జరుగుతోన్న భారీ యాక్షన్ సీన్‌లో మరో హీరో శ్రీకాంత్ కూడా పాల్గొంటున్నారు. ఈ ఎపిసోడ్ పూర్తయిన తర్వాతనే చిత్రీకరణ ఆపుతారని టాక్.

సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

Nandamuri Balakrishna continuous shooting for Akhanda

ఒకపక్క సినిమాల షూటింగులు నిలిచిపోతున్నా.. బాలయ్య మాత్రం ధైర్యంగా ముందడుగు వేస్తున్నారట. అందుకు అనుగుణంగానే స్పాట్‌లో చాలా తక్కువ మంది సిబ్బంది ఉండేలా చర్చలు తీసుకుంటున్నారని టాక్. 'అఖండ'లో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి పవర్‌ఫుల్ రైతు పాత్ర కాగా.. మరొకటి అఘోరా రోల్. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తున్నారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మే 28న విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X