మాస్ కా బాప్.. ముంబైలో బాలకృష్ణ క్రేజ్ అంటే అట్లుంటది.. జై బాలయ్యకు బాలీవుడ్ స్టెప్పులు

జై బాలయ్య.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన పేరు ఓ స్లోగన్​. ఇది వినగానే అభిమానుల్లో పూనకాలు టన్నుల కొద్దీ బయటకు తన్నుకుని వస్తుంది. సమయం సందర్భం లేకుండా కూడా అభిమానులు ఆయన పేరు విచ్చలవిడిగా వాడేస్తుంటారు. అయితే ఆయన క్రేజ్ ఇక్కడ మాత్రమే కాదు బాలీవుడ్​లోనూ భారీగా ఉందన్న సంగతి మీకు తెలుసా? తాజాగా అందుకు సంబంధించిన ఓ ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

తెలుగు చలన చిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయాన్ని తెలిపారు. ఈ వేడుకల ద్వారా ఫండ్‌ రైజ్‌ చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా సభ్యులను ఆదుకుంటామని తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మా ప్రెస్ మీట్​లో దీన్ని పేర్కొన్నారు. నవతి పేరుతో మలేషియాలో ఈ ఈవెంట్​ను భారీగా నిర్వహించనున్నట్లు చెప్పుకొచ్చారు.

Nandamuri Balakrishna Craze in Mumbai Bollywood Steps to Jai Balayya Slogan Video Goes Viral

ఈ ఈవెంట్ మలేషియాలో నిర్వహిస్తాం. ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి తేదీని అనౌన్స్ చేస్తాం. తెలుగు చిత్ర పరిశ్రమకు స్వర్ణయుగం నడుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి గారికి పద్మవిభూషణ్‌ రావడం గొప్ప విషయం. మొదటి తెలుగు యాక్టర్​ ఈ అవార్డును అందుకోవడం. గర్వించదగ్గ విషయం. ఇక్కడే కాదు బాంబేలోనూ ఏదైనా పార్టీస్​, ఈవెంట్లు, పబ్స్​కు వెళ్లితే అక్కడ లాస్ట్ సాంగ్ కచ్చితంగా బాలయ్య పాటే ఉంటుంది. జై బాలయ్యతోనే అవి ముగుస్తాయి.

నా బ్రదర్ అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చింది. చిన్న విషయం కాదు. కేరళలో అతనికి అక్కడి వారితో సమానంగా క్రేజ్ ఉంటుంది. నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్‌ హైయెస్ట్ పెయిడ్‌ ఇండియన్ యాక్టర్‌ అయ్యాడు. ఆయన సినిమా కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. పెద్ద సినిమా వస్తుందని భావిస్తారు. అందుకు కారణం అతడికున్న హుమిలిటీ. మిత్రుడు మహేశ్ - రాజమౌళి సినిమా ఆసియాలోనే హెయెస్ట్ బడ్జెట్ మూవీ కాబోతోంది. రాజమౌళి తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచారు. కీరవాణి ఆస్కార్​ను అందకున్నారు. అలా అన్నీ చోట్ల తెలుగు ఉంది.

ప్రస్తుతం మేం చేయబోతున్న ఈవెంట్​ను గ్రాండ్ సక్సెస్​ చేయాలని, అందుకు మీడియా మిత్రుల సహకారం కావాలని కోరుతున్నాను. అని మంచు విష్ణు అన్నారు. అయితే ఈ కామెంట్స్​లో బాలయ్య బాబు క్రేజ్ గురించి హైలైట్ అయింది. ఇది ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అది బాలయ్య క్రేజ్ అంటే మాములుగా ఉండదు మరి అని చెబుతున్నారు.

ఇకపోతే ఈ వేడుకలు కారణంగా జులైలో చిత్రీకరణలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశాం. దీనిపై ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు పాజిటివ్​గా రియాక్ట్ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఘన కీర్తిని చాటి చెప్పేందుకే ఈ వేడుకలు నిర్వహించబోతున్నాం. అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కోసం పెద్ద భవనం కట్టించడంతో పాటు అనేక సంక్షమ కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చి అధ్యక్షుడిగా గెలిచారు మంచు విష్ణు. కానీ బిల్డింగ్ విషయంలో ఇప్పుడు మౌనం పాటిస్తూ.. కొన్ని హామీలవరకు నెరవేర్చి సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈవెంట్​ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X