Balayya - Sreeleela: శ్రీలీలతో కలిసి స్టెప్పులేసిన బాలయ్య... డ్యాన్స్ ఇరగదీశారుగా!
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల కాలంలో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు అఖండ సినిమా తర్వాత అంతా కలిసి వస్తున్నట్లు తెలుస్తోంది. ఏ సినిమా చేసిన సక్సెసే.. ఏ షో చేసినా సూపర్ హిట్టే. ఇక ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య... హీరోయిన్ శ్రీలీలతో కలిసి స్టెప్పులేశాడు. కుర్రహీరోయిన్ తో సమానంగా ఆయన డ్యాన్స్ చేశాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం పదండి.
కరోనా టైం.. సినిమాలు లేవు.. దర్శక నిర్మాతలు మూవీ రిలీజ్ చేయాలంటే భయపడే సిచ్యూవేషన్. ఇక అప్పుడు అఖండ అంటూ వచ్చాడు బాలయ్య. కరోనా అయితే ఏంటి.. అంటూ మూవీని దైర్యంగా రిలీజ్ చేశాడు. ఇక అప్పటి వరకు కరోనా అంటూ భయపడినా జనాలంతా ఆఖండ సినిమాకు ఎగబడ్డారు. సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక సిని పరిశ్రమకు అఖండ సినిమాతో దారి చూపించిన బాలయ్య... ఆ తర్వాత వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్ అంటూ సినిమాలు రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాయి.

ఇక ఆ తర్వాత ఓటీటీ బాట పట్టిన బాలయ్య... అన్ స్టాపబుల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ షో జనాల్లోకి దూసుకుపోయింది. సూపర్ హిట్టుగా నిలిచింది. రెండో సీజన్ తీశారు. అది కూడా బంపర్ హిట్ అయింది. ఇప్పుడు దసరా కానుకగా మూడో సీజన్ కూడా ప్రారంభం అవుతుంది. ఇక ఈ ఏడాది బాలయ్య వీరసింహరెడ్డి అంటూ సంక్రాంతికి వచ్చాడు. అది కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక బాలయ్య ఏం చేసినా కలిసి వస్తుంది.
ఇప్పుడు మరోసారి భగవంత్ కేసరి సినిమాతో రాాబోతున్నాడు బాలయ్య. ఈ సినిమాకు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ ఆగర్వాల్ నటిస్తుంది. కూతురిగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. ఇక విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు మరోసారి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.
భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్రబృందం.. ఇటీవల ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కూడా జరుపుకుంది. ఇక ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. బాలయ్య మునుపెన్నడూ చూడని గెటప్ లో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. తండ్రీ కూతుళ్ల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఇక సెంటిమెంట్, యాక్షన్ అన్ని కలగలపి ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది.

అయితే భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం పక్కన పెడితే.. బాలయ్య శ్రీలీలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. శ్రీలీలతో బాలయ్య డాన్స్ ఇరగదీశాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











