Balakrishna ఎదురొస్తే తొక్కి పడేస్తా.. ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను టార్గెట్ చేసిన బాలకృష్ణ
నందమూరి నటసింహం ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటునే.. మరోవైపు ఏపీ ఎన్నికల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే.. ఫ్యాన్స్ కు పండగే.. జై బాలయ్య అంటూ నినాదాలతో థియేటర్ మొత్తం హొరెత్తిపోతుంది. ఇక ఆయన డైలాగ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంటుందనే విషయం తెలిసిందే. మరి ఆయన డైలాగ్స్ ను మన ఫేవరేట్ క్రికెటర్స్ కు డెడికేట్ చేస్తే... స్వయంగా బాలయ్య ఆ డైలాగులు చేప్తే.. బొమ్మ సూపర్ హిట్టు అవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు ఓ లుక్కేయండి.
తెలుగు తెరపై బాలకృష్ణకు ఓ ప్రత్యేక స్థానం ఉందనే చెప్పాలి. ఆయన పేరు వింటేనే చాలు అభిమానుల్లో పూనకాలు.. రెట్టింపు ఉత్సాహం వచ్చేస్తోంది. స్క్రీన్ మీద కనిపిస్తే.. జై బాలయ్య అనాల్సిందే. కరోనా టైం నుంచి బాలయ్యకు మంచి టైమింగ్ నడుస్తుందని చెప్పవచ్చు. అఖండ నుంచి గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సిినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. ఆ సినిమాల్లోని డైలాగ్స్ కూడా సూపర్ హిట్టే. ఇప్పటికే రోజూ మనం బాలయ్య డైలాగ్స్ ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం.

అయితే తాజాగా బాలయ్యకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఐపీఎల్ స్టార్ క్రికెటర్స్ ను ఉద్దేశిస్తూ స్వయంగా బాలయ్య చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే ఐపీఎల్ సందడి ప్రారంభం కానుంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ఫస్ట్ షెడ్యూల్ మ్యాచులు స్టార్ట్ కానున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టాయి.
ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ప్రచార కార్యక్రమంలో బాలయ్య మెరిశారు. ఆయన పాల్గొని సందడి చేశారు. ధోని, కోహ్లి, రోహిత్ శర్మ గురించి బాలయ్య సూపర్ డైలాగ్స్ చెప్పారు. యాంకర్ ధోని గురించి మీ సినిమాలోని డైలాగ్ డెడికేట్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు అని అడుగుతుంది. దానికి బాలయ్య సీఎస్కే కెప్టెన్ ధోనీకి డు నాట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్... ట్రబుల్ ట్రబుల్స్ యు... ఐ యామ్ నాట్ ది ట్రబుల్.. అనే డైలాగ్ డెడికేట్ చేశాడు.
ఇక ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీకి ఏ డైలాగ్ చెప్తారని అడగ్గా... దానికి బాలయ్య "నేను ఒకడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్. తొక్కిపడేస్తా" అంటూ చెప్పుకువచ్చాడు. ఇక ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ డెడికేట్ చేసే డైలాగ్ బాలయ్య డైలాగ్.. ఫ్లూట్ జింక ముందు ఊదు. సింహం ముందు కాదని చెప్పుకువచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











