twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి మానవత్వం ప్రదర్శించిన బాలకృష్ణ.. హిందూపురం ప్రజల కోసం..

    |

    టాలీవుడ్ బాక్సాఫీస్ బొనాంజా, నట సింహం, హిందూపురం ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి మానవత్వాన్ని ప్రదర్శించారు. తనను ఎన్నుకొన్న ప్రజల ఆరోగ్యం గురించి భారీగా విరాళం ప్రకటించారు. ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలువాలని బాలయ్య భావించారు.

    హిందూపురం పరిధిలోని కరోనా పేషెంట్లకు రూ.55 లక్షల విలువైన పీపీఈ కిట్స్,మాస్కులు, మెడిసిన్స్, ఇతర పరికరాలను ప్రభుత్వ హాస్పిటల్‌కు అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇలాంటి పరికరాలు, కిట్స్ అందించడం వల్ల కరోనా పేషెంట్లకు సేవ చేసే వైద్యులకు రక్షణ కవచంలా ఉపయోగపడుతాయి. ఆగస్టు 29, 30వ తేదీన తన నియోజకవర్గంలో పర్యటించి ఈ పంపిణీ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు.

    Nandamuri Balakrishna donates worth 55 Lakhs corona kits to Hindupur government hospital

    గతంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో బసవతారకం ట్రస్ట్ తరఫున 25 లక్షల విలువైన 2 వెంటిలేటర్లు, 100 పీపీఈ యూనిట్లు, మాస్కులు అందించారు. అంతేకాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కోటి రూపాయల విరాళం కూడా అందించారు.

    అలాగే సినీ కార్మికులను ఆదుకొనేందుకు కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కోసం 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తన హిందూపూరం నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం తీసుకొన్న నిర్ణయంపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    English summary
    Actor, MLA Nandamuri Balakrishna donates worth 55 Lakhs corona kits to his Hindupur consittuency's government hospital. This aid will help Corona Patients and to COVID warriors who are treating them at COVID Center in Hindupur Government Hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X