సీనియర్ ఎన్టీఆర్ చేయాలని ఆశపడ్డ సినిమా.. బాలయ్య చేతిలోకి.. ఏ మూవీ అంటే?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోగా దుమ్ములేపుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వరుస విజయాలతో నందమూరి అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేశారు. ఆరు పదుల వయస్సుల్లోనూ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా బాలయ్యకు తాజాగా హిందూపురంలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా తన తండ్రి, తెలుగు నటతేజం, మాజీ సీఎం, దివంగత సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. అయితే తన తండ్రి చేయాలని ఎంతగానో ఆశపడ్డ ఒక చిత్రం గురించి చెప్పారు. ఆయన చేయలేకపోవడంతో తాను చేశానని చెప్పారు.
బాలకృష్ణకు పద్మ విభూషణ్ అవార్డు..
నందమూరి నట సింహం, బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును అందించింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా హిందూపురణంలో బాలకృష్ణ అభిమానులు, నియోజకవర్గ ప్రజులు, టీడీపీ లీడర్లు ఆయను అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాలయ్య తన తండ్రి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పారు.

సీనియర్ ఎన్టీఆర్ చేద్దామనుకున్న సినిమా ఇదే..
నందమూరి బాలకృష్ణ ఎన్నో యాక్షన్, ఫ్యామిలీ చిత్రాల్లో నటించి అలరించారని చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలోనే తన తండ్రి నట సార్వ భౌమా నందమూరి తారక రావు నటించాలనుకున్న ఓ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఎన్నో విభిన్న పాత్రలు పోషించారని చెప్పుకొచ్చారు. ఇక అన్నగారు చేయాలని, చేయలేకపోయిన ఒకే ఒక్క చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పారు. తన తండ్రి కోరిక మేరకు ఆ చిత్రాన్ని తన ద్వారా తెలుగు ప్రేక్షకులకు చూపించే అవకాశం వచ్చిందన్నారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ పౌరాణికం, సాంఘిక, హిస్టారికల్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యుల పాత్రల్లో నటించి మెప్పించారు. ఇఖ గౌతమిపుత్ర శాతకర్ణుడి పాత్రలో నటించాలని ఎంతగానో ఆశపడ్డారంట. కానీ పలు కారణాల వల్ల చేయలేకపోయారని నందమూరి బాలకృష్ణ తాజాగా చెప్పుకొచ్చారు.
వరుసగా 4 బ్లాక్ బాస్టర్లు..
నందమూరి బాలకృష్ణ వరుసగా 4 బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకున్నారు. 50 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగానే కొనసాగుతున్నారు బాలకృష్ణ. ఈ రికార్డు ఇండియాలోనే కేవలం బాలకృష్ణకే దక్కడం విశేషం. మరోవైపు వరుసగా పురస్కారాలు కూడా అందుకుంటూనే ఉన్నారు. 'అఖండ' మొదలు వరుసగా హిట్లు కొట్టుకుంటూ వచ్చారు. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్, వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
బాలకృష్ణకు దక్కిన పురస్కారాలు..
సినీ పరిశ్రమలో విశేష సేవలు అందిస్తున్నందుకు గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును అందించింది. రీసెంట్ గానే రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అంతే కాకుండా 3 నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే ఐఫా, సైమా, సినిమా అవార్డులను దక్కించుకున్నారు. టీఎస్ఆర్ నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు.


Click it and Unblock the Notifications











