Pro Kabaddi League గచ్చిబౌలి స్టేడియంలో తొడ కొట్టనున్న బాలయ్య.. ఏ రోజు అంటే?

దేశవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆకట్టుకొంటున్న ప్రో కబాడ్డీ లీగ్‌ క్రీడా సంబురాలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. కబాడ్డీ ఆటను అభిమానించే వారికి ఈ వార్త ఆనందం కలిగిస్తున్నది. అత్యంత ఆదరణ ఉన్న ఈ పోటీలతో టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ భాగం కానున్నారు. ఈ సందర్భంగా బాలయ్యను తెలుగు టైటాన్స్ జట్టు కెప్టెన్, కోచ్ తదితరులు కలిసి సపోర్ట్ కోరారు. ఈ సందర్భంగా బాలయ్య అందించిన ప్రోత్సాహ వివరాలను వెల్లడిస్తూ..

ప్రో కబాడ్డీ సీజన్ 10 అట్టహాసంగా మొదలు కాబోతున్నది. ఈ పోటీలో పాల్గొంటున్న తెలుగు టైటాన్స్ జట్టుకు నందమూరి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కాబోతున్న ఈ లీగ్‌కు బాలకృష్ణ సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ పోటీల కోసం బాలయ్యతో ఓ ప్రమోషనల్ వీడియోను షూట్ చేసిన సంగతి తెలిసిందే.

 Nandamuri Balakrishna Extended Support to Pro Kabaddi League Starts January 19th at Hyderabad Gachibowli Stadium

ప్రో కబాడ్డీ సీజన్ 10 జనవరి 19వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తరఫున బాలయ్య హాజరవుతారు. ఈ సందర్భంగా తెలుగు టైటాన్స్ జట్టుకు ఆయన ప్రోత్సాహాన్ని అందజేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాలకృష్ణను తెలుగు టైటాన్స్ జట్టు కెప్టెన్ పవన్ షెర్వాత్, కోచ్ శ్రీనివాసరెడ్డి కలిశారు. ఘన విజయం సాధించాలని వారికి ఆయన బెస్ట్ విషెస్ తెలియజేశారు.

బాలకృష్ణను కలిసిన తర్వాత కెప్టెన్ పవన్ షెర్వాత్ మాట్లాడుతూ.. తెలుగు టైటాన్స్ జట్టుకు బాలకృష్ణ విషెస్ తెలియజేశారు. ఈ పోటీల కోసం ఎదురు చూస్తున్నానని తన ఉత్సాహన్ని చూపించారు. హైదరాబాద్‌లో జరిగే పోటీల విజయ సాధించడానికి ఉత్సాహంగా ఉన్నాం. అభిమానుల ప్రోత్సాహం మాకు విజయాన్ని సాధించేందుకు డ్రైవింగ్ ఫోర్స్‌గా మారుతుందని భావిస్తున్నాం అని అన్నారు.

 Nandamuri Balakrishna Extended Support to Pro Kabaddi League Starts January 19th at Hyderabad Gachibowli Stadium

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు టైటాన్స్ జట్టు విజయం సాధించాలని విషెస్ తెలియజేశాను. ఆ జట్టుకు ఎప్పుడూ నా సహకారం ఉంటుంది. హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో వారు గెలుపు సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. జనవరి 19వ తేదీ నుంచి జరిగే పోటీలకు కబాడ్డీ ప్రేమికులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున వచ్చి సపోర్ట్ చేయాలి అని బాలకృష్ణ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X